హోమ్ /వార్తలు /సినిమా /

Itlu Maredumilly Prajaneekam: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్ డేట్ ఫిక్స్.. !

Itlu Maredumilly Prajaneekam: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్ డేట్ ఫిక్స్.. !

ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టాలీవుడ్ హీరో అల్లరి నరేష్  లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమా టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. నరేష్ 59వ సినిమాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.  దీనికోసం అడవుల్లోకి వెళ్లి మరీ షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది. కెరియర్ పరంగా అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు.

  మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఆ ఊరి జనం బతుకుతూ ఉంటారు. అయితే ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు . ట్రైలర్‌లో మనకు ఇవే చూపించారు.

  ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి' .. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అల్లరి నరేశ్ హీరోగా ఈ పాటికి 'సభకి నమస్కారం' సినిమా రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మరో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఆ సినిమా పేరే

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Allari naresh, Naresh

  ఉత్తమ కథలు