పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రం చౌదరి (Veerabhadram Chowdary) దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా దిల్‌వాలా (Dilwala). ఈ చిత్రాన్ని డెక్కన్ డ్రీమ్ వర్క్స్ పతాకంపై నభిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. సేనాపతి, మత్తు వదలరా చిత్రాలతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య (Naresh Agastya) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన శ్వేత అవస్తి (Swetha Awasthi) హీరోయిన్ గా చేస్తోంది.
క్రైమ్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం వైజాగ్‌లో 20 రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంది. గత కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా చిత్రానికి సంబంధించి టాకీ పార్ట్ పూర్తి చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులతో పాటి ఫేమస్ సాంకేతిక నిపుణులు భాగమవుతున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు.
మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాగా.. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ రెండు పాటలను బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నరేష్ అగస్త్య, శ్వేత అవస్థి, ప్రజ్ఞా నైనా, రాజేంద్ర ప్రసాద్, అలీ రెజా, దేవ్ గిల్, అలీ పోసాని, బ్రహ్మాజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రమ్, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఈస్టర్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష, రాజా రవీంద్ర, గిరిధర్, అవినాష్, జబర్దస్త్ చంటి, ఎంవీవీ సత్యనారాయణ, శ్రీదేవి, విహారిక తదితరులు ముఖ్య పాత్రలు పోహసిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.