తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సాధించిన నరేంద్రమోదీ.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటుతున్నారు. తన పేరిట వచ్చిన బయోపిక్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేస్తోంది. అద్భుత కలెక్షన్లు సాధిస్తూ రికార్డు దిశగా దూసుకెళ్తోంది. వివేక్ ఓబెరాయ్ ప్రధాన ప్రాతల్లో పీఎం నరేంద్రమోదీ పేరిట వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలు, అంతే ఆందోళనల మధ్య రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజునే ఈ మూవీ రూ.2.88 కోట్లను కురిపించగా.. అదే రికార్డును కొనసాగిస్తూ రెండో రోజు.. 3.76 కోట్లు, మూడో రోజు రూ.4.50 కోట్లు సాధించగా వీకెండ్ కారణంగా మిగతా సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి ఇండియా మొత్తంలో ఏకంగా 11.14 కోట్ల కలెక్షన్లని రాబట్టింది.
ఈ కలెక్షన్లన్నింటినీ చూసి మొదట్లో సినిమాపై నెగెటీవ్ కామెంట్స్ చేసిన క్రిటిక్స్ కూడా అందరి అంచనాలను మించి పీఎం నరేంద్రమోదీ ఫిల్మ్ వీకెండ్‌ని బాగానే క్యాష్ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు, ఎన్నిల ఫలితాల ఆధారంగా ఏప్రిల్ 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మే 24న రిలీజైంది.
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తిరుగలేని రిజల్ట్ సాధించిన మోదీ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా అఖండ విజయానికి కారణంగా చెప్పొచ్చు. సినిమా విషయానికొస్తే ఓమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వివేక్ ఓబెరాయ్ మోడీ క్యారెక్టర్ చేయగా.. మోడీ తండ్రి క్యారెక్టర్ రాజేంద్ర గుప్తా, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్‌షాగా మనోజ్ జోషిలు నటించారు. సినిమాలో పేదరికాన్ని రూపు మాపేందుకు నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. ఏమేం చేశారన్నదే మెయిన్ హైలైట్‌గా చూపించారు.
ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ అనన్య భట్టాచార్య ఇచ్చిన రివ్యూ ప్రకారం.. నిజజీవితంలో నేంద్ర మోదీ పడ్డ కష్టాలు.. ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన తీరు టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని స్థాయికి చేరేవరకూ ఇలా ఆయన జీవన ప్రయాణాన్ని మొత్తాన్ని సినిమాలో చూపించారు’ అంటూ పాజిటీవ్ కామెంట్స్ చేసింది. ఇక వివేక్ ఓబెరాయ్ క్యారెక్టర్ గురించి ప్రస్తావించిన అనన్య.. ‘సినిమాలో వివేక్ ఓబెరాయ్ ఎక్కడ కనిపించడు.. ప్రధాని నరేంద్ర మోడీయే యాక్ట్ చేశాడా అన్నట్లుగా జీవించాడు.. లుక్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాడు.. చూడగానే మోడీ వచ్చాడా అన్నట్లుగా మీసం, గడ్డాన్ని పెంచి అంతే హుందాగా నడిచొస్తూ చక్కగా యాక్టింగ్ చేశాడు’ పాజిటీవ్ రివ్యూని ఇచ్చింది అనన్య.
మొత్తానికీ ఓ వైపూ ఎన్నికల ఫలితాల్లో రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ.. పరోక్షంగా బాలీవుడ్ బాక్సాఫీస్‌కి షేక్ చేసేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Amit Shah, Bjp, Bollywood, Bollywood Movie, Bollywood news, Lok sabha election results, Narendra modi, Pm modi, PM Narendra Modi Biopic, Vivek Oberoi