హోమ్ /వార్తలు /సినిమా /

ప్రముఖ కమెడియన్ ఇంటిపై NCB దాడులు.. డ్రగ్స్ లింక్‌పై ప్రశ్నలు

ప్రముఖ కమెడియన్ ఇంటిపై NCB దాడులు.. డ్రగ్స్ లింక్‌పై ప్రశ్నలు

భారతి సింగ్

భారతి సింగ్

NCB raids at Bhharti singh residence: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై పలు చోట్ల సోదాలు జరిపి.. ప్రముఖ నటీ నటులను ఈ కేసులో విచారించారు.

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ కమెడియన్ భారతి సింగ్ ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దాడులు జరిపింది. సోదాల అనంతరం భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లిబచియాను అదుపులోకి తీసుకొని ప్రశ్నలు వర్షం కురిపించారు. శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై పలు చోట్ల సోదాలు జరిపి.. ప్రముఖ నటీ నటులను ఈ కేసులో విచారించారు. గతవారం నటుడు అర్జున్ రాంపాల్, ఆయన పార్టనర్ గాబ్రియేలా డెమిట్రియాడెస్‌ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు. ఇక బాలీవుడ్ నిర్మాత ఫెరోజ్ ఎ.నడియాడ్‌వాలా భార్యను అరెస్టు చేశారు. టీవీ జంట సనమ్ జోహర్, అబిజైల్ పాండేల ఇళ్లలోనూ సోదాలు చేశారు.

అక్టోబరులో లోనావాలోని ఓ రిసార్ట్‌లో సౌతాఫ్రికాకు చెందిన అజిసిలోస్‌ను అరెస్ట్ చేశారు. కాబోయే భార్యతో కలిసి రిసార్ట్‌లో ఉన్న సమయంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేసి 0.8 గ్రాముల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, భారతి సింగ్ ఇటీవల కపిల్ శర్మ షోలో కనిపించారు. లల్లీ అనే కమెడియన్ పాత్రను ఆమె పోషించారు. ప్రస్తుతం ఆమె తన భర్త హర్ష్ లిబచియాతో కలిసి .. సోని టీవీలో ప్రసారమయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఝలక్ థిఖ్లా జా, నాచ్ బలియే వంటి పలు రియాల్టీ షోల్లోనూ ఆమె గతంలో సందడి చేశారు. 2017 డిసెంబర్ 3న హర్ష్ లిబచియాతో భారతికి వివాహం జరిగిన విషయం తెలిసిందే.

First published:

Tags: Bollywood

ఉత్తమ కథలు