ట్రైలర్: ‘వీర భోగ వసంత రాయలు’... నారా రోహిత్ మరో ప్రయోగం

ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్... మరోసారి వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తున్న నారా రోహిత్... ప్రధాన పాత్రల్లో సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియా శరణ్‌!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 15, 2018, 8:45 PM IST
ట్రైలర్: ‘వీర భోగ వసంత రాయలు’... నారా రోహిత్ మరో ప్రయోగం
‘వీరభోగ వసంతరాయలు’ చిత్ర పోస్టర్
  • Share this:
టాలీవుడ్‌లో విభిన్నమైన కాన్సెప్ట్స్ ఎంచుకుని, ప్రతీ సినిమాకీ వైవిధ్యం ఉండాలని పరితపించే హీరో ఎవ్వరైనా ఉన్నారా... అంటే అది నారా రోహితే! నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినా, పెద్దగా హడావుడి లేకుండా మొదటి నుంచి కొత్తదనం ఉన్న స్క్రిప్టులనే ఎంచుకుంటూ, తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రోహిత్. అందుకే కొత్తదనం కోసం వేచిచూసే ఓ వర్గం తెలుగు ప్రేక్షకులు రోహిత్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

రీసెంట్‌గా ‘ఆటగాళ్లు’ సినిమాతో నిరాశపర్చిన రోహిత్... ఈసారి మాత్రం పక్కా వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు నారారోహిత్. ‘వీరభోగవసంతరాయలు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియా శరణ్‌లు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. ఓ ఏరియాలో వరుసగా ఆడపిల్లలు కనబడడం జరుగుతుంది. అలాగే ఓ పిల్లాడు ఇల్లు పోయ్యిందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. అలాగే ఓ ఫ్లైట్ హైజాక్ జరుగుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఓ మాస్క్ వేసుకుని ఇవ్వన్నీ చేస్తుంటాడో వ్యక్తి. శ్రియాశరణ్, నారా రోహిత్, సుధీర్ బాబు... ముగ్గురు కూడా పోలీస్ ఆఫీసర్లుగానే నటిస్తున్నారు. మాస్క్ వేసుకుని కనిపించే వ్యక్తి శ్రీవిష్ణు అయ్యి ఉండొచ్చు. కొన్నాళ్ల క్రితం విడుదలయ్యిన టీజర్‌కీ, ఇప్పుడు వచ్చిన ట్రైలర్‌కీ మధ్య అస్సలు సంబంధమే లేకపోవడం విశేషం.

‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనే ట్యాగ్‌లైన్ బట్టి చూస్తే, మతారాధనకు వ్యతిరేకంగా తెరకెక్కుతున్న చిత్రంగా ఈ టీజర్ ఆసక్తి రేకెత్తిచ్చింది. ట్రైలర్ ఏమో ఓ సస్పెన్స్ థిల్లర్ మూవీలా కనిపిస్తోంది. మరి నారా రోహిత్ అండ్ బ్యాచ్ ఎలాంటి మూవీని మన ముందుకు తెస్తున్నారో చూడాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

‘వీరభోగ వసంతరాయలు’ ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
Published by: Ramu Chinthakindhi
First published: October 15, 2018, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading