హోమ్ /వార్తలు /సినిమా /

హ్యాట్సాఫ్ చిరంజీవి.. ఆకాశానికెత్తేసిన లోకేష్.. కొణిదెల వారి రియాక్షన్ ఏంటంటే..

హ్యాట్సాఫ్ చిరంజీవి.. ఆకాశానికెత్తేసిన లోకేష్.. కొణిదెల వారి రియాక్షన్ ఏంటంటే..

చిరంజీవి, నారా లోకేష్

చిరంజీవి, నారా లోకేష్

‘తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు నారా లోకేష్. సైరా నరసింహారెడ్డి సినిమా మీద పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారంటూ కొనియాడారు. ‘తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో పాటు సైరా సినిమా నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, ఇతర టెక్నీషియన్లను కూడా లోకేష్ అభినందించారు. ‘ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి, సాంకేతిక సిబ్బంది, యూనిట్ మొత్తానికీ హార్దికాభినందనలు’ అని మరో ట్వీట్ చేశారు.

నారా లోకేష్ ట్వీట్‌కు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Chiranjeevi, Megastar, Nara Lokesh, Sye raa narasimhareddy

ఉత్తమ కథలు