Shyam Singha Roy - Nani : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసారు. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది.
పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీకి ఆయువు పట్టులాంటి సిరివెన్నెల అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను నాని, సాయి పల్లవిలపై పిక్చరైజ్ చేశారు. ఇదో విజువల్ వండర్‌గా ఉందంటూ అభిమానులు కితాబు ఇస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
The Soul of #ShyamSinghaRoy
Enjoy the Pleasant Eve with #SiriVennela Video Song?
▶️ https://t.co/n3rJBkAhIV
✍️#SiriVennelaSeetharamaSastry garu#BlockBusterClassicSSR?@NameisNani @Sai_Pallavi92 @MickeyJMeyer @anuragkulkarni_@Rahul_Sankrityn @NiharikaEnt @saregamasouth pic.twitter.com/X2WPCXBN0F
— BA Raju's Team (@baraju_SuperHit) December 28, 2021
‘శ్యామ్ సింగరాయ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్లో కలిసి రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. విజయానికి రూ. 3 కోట్ల దూరంలో ఉంది. మొత్తంగా నాని చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు ఏపీలో భారీ నష్టాన్ని కలిగించాయనే చెప్పాలి. లేకపోతే.. ఆ పాటికీ ‘శ్యామ్ సింగరాయ్’కు లాభాల్లోకి వచ్చి ఉండేది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే కదా.
Varudu Kaavalenu : నాగ శౌర్య, రితూ వర్మల ‘వరుడు కావాలెను’ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఫిక్స్..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. వీక్ డేస్‌లో నిలబడితే సినిమా నిలబడినట్లు లేదంటే అంతే సంగతులు. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. నాని నటించిన గత రెండు చిత్రాలు ‘వీ’, ‘టక్ జగదీష్’ చిత్రాలు థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత నాని సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో కచ్చితంగా వారం రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సేఫ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nani, Sai Pallavi, Shyam Singha Roy, Tollywood