నటీనటులు: నాని,శ్రద్ధా శ్రీనాథ్,సత్యరాజ్,రావు రమేష్,బ్రహ్మాజీ
సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్
కెమెరా : సాను జాన్ వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
రేటింగ్ : 3/5
ఎంసీఏ సినిమా వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో దూసుకుపోయిన నాని.. ఆ తర్వాత చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’,‘దేవదాస్’ సినిమాల ఫ్లాప్ తర్వాత..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా చేసాడు.ఎమోషనల్ క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రంతో నాని హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా మన రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అర్జున్ (నాని) రంజీ క్రికెటర్. అతను సారా (శ్రద్ధా శ్రీనాథ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికో కొడుకు అతని పేరు నాని. 26 ఏళ్లపుడు క్రికెట్‌కు దూరం అయి తనకు ఇష్టం లేని ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అనుకోని పరిస్థితుల్లో అర్జున్..తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అప్పటికే అర్జున్ పదేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు. భార్య కూడా అతన్ని అర్థం చేసుకోదు. ఇలాంటి సందర్భంలో అర్జున్..ఏం చేసాడు. చివరకు అర్జున్ జీవితంలో అనకున్నది సాధించి కొడుకు దృష్టిలో హీరో అయ్యాడా లేదా అనేదే ‘జెర్సీ’ సినిమా స్టోరీ.
క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత నాని ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర చేసాడు. ఒక క్రికెటర్‌గా, లవర్‌గా, తండ్రిగా ఒక సగటు భర్తగా నాని నటించాడనే కంటే ఆ పాత్రలో జీవించాడు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన పరిధి మేరకు బాగానే నటించింది. ఒక ప్రేమికురాలిగా..సగటు భార్యగా శ్రద్ధా శ్రీనాథ్ నటన బాగుంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే..కోచ్ పాత్రలో సత్యరాజ్ నటన చాలా బాగుంది. ఇక రావు నరేష్ నటన బాగుంది.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..
‘మళ్లీరావా’ సినిమాతో తన టేస్ట్ ఏంటో చూపించిన గౌతమ్ తిన్ననూరి..సెకండ్ సినిమాను కూడా ఒక ఎమోషనల్ క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంతా ఆషామాషీ కాదు. ఏదో తీసామన్నట్టు కాకుండా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలు చాలా నాచురల్‌గా ఉన్నాయి. సినిమాలో ఎమోషనల్ డ్రామాను పండించడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. కొన్ని సన్నివేశాల్లో బోర్ కొట్టించాడు. సగటు మాస్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్. సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ ఇచ్చిన సంగీతం, ఆర్ ఆర్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్తా శ్రద్ద పెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్..
మైనస్ పాయింట్స్
చివరగా జీవితంలో ఏదైనా సాధించడానికి వయసు ఏమంత అడ్డంకి కాదని ఈసినిమా ప్రూవ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gowtam Tinnanuri, Jersey movie review, Nani, Shraddha Srinath, Telugu Cinema, Tollywood