హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు నాని కళ్లలో ఆనందం.. బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జెర్సీ’ మూవీ..

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు నాని కళ్లలో ఆనందం.. బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జెర్సీ’ మూవీ..

నాని కూడా రెండు ఫ్లాపుల తర్వాత 2019లో విజయం అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ తర్వాత ఈ ఏడాది నటించిన జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకున్నాడు. అయితే అద్భుతమైన టాక్ వచ్చినా కూడా ఎందుకో కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గిపోయాడు నాని.

 గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే  సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే  సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని నటనను అందరు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాని నటనను మెచ్చుకుంటున్నారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ఒక క్రికెటర్‌గా, ప్రేమికుడిగా,సగటు భర్తగా, తండ్రిగా నాని నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇక రెండు వరుస ఫ్లాపుల తర్వాత విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.7 కోట్లగ్రాస్.. రూ. 5 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా రూ.25.65 కోట్లకు అమ్ముడుపోయింది. తాజాగా 11 రోజులతో ఈ సినిమా రూ.25 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒక్క ఓవర్సీస్‌లోనే ఈ సినిమా రూ.5 కోట్లను రాబట్టినట్టింది. ఇక డిజిటల్, శాటిలైట్ రూపంలో ‘జెర్సీ’ మరో రూ.15 కోట్లు నిర్మాతలు వెనకేసుకున్నారు. మొత్తానికి చాలా కాలానికి నాని నటించిన ‘జెర్సీ’ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

    First published:

    Tags: Box Office Collections, Jersey, Jersey movie review, Nani, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు