HOME »NEWS »MOVIE »nanis gang leader trailer talk ta

Nani's Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..

Nani's Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)

Nani's Gang Leader Trailer | ఈ యేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఈ  సినిమా తర్వాత నాని ..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

  • Share this:
    ఈ యేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఈ  సినిమా తర్వాత నాని ..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాని ఐదుగురు ఆడవాళ్లు ఉన్నగ్యాంగ్‌కు లీడర్. అందులో 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల  వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న ముసలావిడ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్ నాి. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌లో నాని.. ఒక సినిమా రైటర్‌ పాత్రలో నటించాడు. సాధారణంగా మన రచయతలు ఎన్నో అంతర్జాతీయ సినిమాలతో పాటు పాత సినిమాలను చూస్తూ 28 రివేంజ్ కథలను రాస్తాడు. తమ పగ తీర్చుకోవడానికై ఈ ఐదుగురు ఆ రైటర్ దగ్గరకు వెళతారు. ఆ మహిళల పగను తీర్చుకోవడంలో గ్యాంగ్ లీడర్‌గా నాని ఎలాంటి కీ రోల్ ప్లే చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.

    ఈ సినిమాలో నాని ఢీ కొట్టే విలన్ పాత్రలో RX 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించాడు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే నెల 13న ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 28, 2019, 12:03 IST