నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేని విక్రమ్ కే కుమార్.. గ్యాంగ్ లీడర్ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్లాడా లేదా ఇంతకీ ప్రివ్యూ టాక్ ఎలా ఉందో చూద్దాం. సినిమా కొంచెం మెల్లగా మొదలైనా.. ఆ తర్వాత ఊపందుకుంది. అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాకు హైలెట్. ఇంటర్వెల్ వరకు ఎంటర్టేననర్గా సాగిన సినిమా.. అక్కడ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు ఈ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసాడు విక్రమ్ కుమార్.
ఆ తర్వాత సీరియస్ మోడ్‌లోకి వెళుతుంది. ఆ తర్వాత తనదైన పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ సినిమాతో ఎమోషనల్‌గా సాగేలా చేయడంలో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల గుండెలను హత్తుకునేలా ఉంటుందంది. ఇదే ఈసినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాని తనదైన యాక్టింగ్‌తో కనెక్ట్ అవుతారు. హీరోయిన్ ప్రియాంక, సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్‌లు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీతో పాటు అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..నెగిటివ్ రోల్లో నటించిన కార్తికేయ నటన ఆకట్టుకుంటాయట. ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ప్రీమియర్ షో చూసిన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో నాని తన ఖాతాలో మరో హిట్టు కొట్టినట్టే చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang Leader, Gang Leader Movie Review, Nani, Telugu Cinema, Tollywood