నాని హీరోగా డిఫరెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేని విక్రమ్ కే కుమార్.. గ్యాంగ్ లీడర్ సినిమాతో కచ్చితంగా ఆ లోటు భర్తీ చేస్తానంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు హ్యుమర్‌తో కూడిన రివేంజ్ స్టోరీ అని చెబుతున్నారు. సినిమా మొత్తం డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉందంటున్నారు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.90 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది ఇండియా రూ. 1.80 కోట్లు.. ఓవర్సీస్ రూ. 5.50 కోట్ల బిజినెస్ చేసింది గ్యాంగ్ లీడర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 28.20 కోట్ల బిజినెస్ చేసింది.
నైజాంలో రూ.8 కోట్లకు అమ్ముడు పోయింది నాని గ్యాంగ్ లీడర్. సీడెడ్ రూ. 3.60.. ఉత్తరాంధ్ర రూ .2.50 కోట్లు.. గుంటూరు రూ.1.80.. ఈస్ట్ రూ. 1.60 కోట్లు.. వెస్ట్ రూ. 1.20 కోట్లు.. కృష్ణ రూ. 1.45 కోట్లు.. నెల్లూరు రూ. 0.75 కోట్ల బిజినెస్ చేసింది. నానికి ఉన్న రేంజ్‌కు పాజిటివ్ టాక్ వస్తే మూడు నాలుగు రోజుల్లోనే ఈ వసూళ్లు అందుకోవడం ఖాయం. మరి ఈ సినిమాతో నాని మరో హిట్టు అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Censor Board, Gang Leader, Gang Leader Movie Review, Nani, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood, Vikram K Kumar