ఈ యేడాది నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. 8 ఏళ్ల చిన్న పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వయసు ఉన్న మహిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడర్.. అతడే మన గ్యాంగ్ లీడర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడర్ కథ. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు. ఒకప్పటి చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టాలనుకోవడం నిజంగా సాహసమే.
కానీ కథపై ఉన్న నమ్మకంతో దాన్ని తీసుకున్నాడు న్యాచురల్ స్టార్. ఇందులో నానితో మరో ఐదు కీలకపాత్రలు ఉంటాయి. వీళ్ల చుట్టూ తిరిగే కథ ఈ సినిమా. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
తాజాగా విడుదలైన పోస్టర్లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. అంతేకాదు ఫస్ట్ సాంగ్‌ను ఈ నెల 18న, టీజర్‌ను 24వ తేదిన రిలీజ్ చేయనున్నట్టు ఈ సినిమా పోస్టర్లో చూపించారు. మొత్తానికి చిరంజీవి పాత సూపర్ హిట్ టైటిల్‘గ్యాంగ్ లీడర్’గా వస్తోన్న నాని ఈ సినిమాతో మరో హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang Leader, Nani, Telugu Cinema, Tollywood, Vikram K Kumar