Home /News /movies /

NANI WILL PLAY IMPORTANT ROLE IN MAHESH BABU TRIVIKRAM COMBO SLB

SSMB29: మరోసారి ఊహలకందని రేంజ్‌లో జక్కన్న ప్లాన్.. వర్కౌట్ అయితే అరాచకమే!

Mahesh Babu Twitter

Mahesh Babu Twitter

Rajamouli Mahesh Babu: రాజమౌళి ఇటీవల విదేశాలకు వెళ్లి ఒక ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో డీల్ కూడా సెట్ చేసుకున్నాడు. ఏదేమైనా కూడా మహేష్ బాబు సినిమాను ఒక విజువల్ ట్రీట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి హై లెవెల్ గ్రాఫిక్స్ కూడా వాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
దర్శకదీరుడు ఎస్ఎస్.రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) చేయబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న జక్కన్న ఇక నెక్స్ట్ మహేష్ బాబును ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది అందరిలో ఎంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదివరకే ఆ సినిమా కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని ఆయన తండ్రి, కథ రచయిత కే విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఒక వివరణ అయితే ఇచ్చారు.

కానీ ఇంకా కథను ఫైనల్ చేయలేదు అని ఇంతకుముందు RRR ప్రమోషన్స్ లో రాజమౌళి ఒక కామెంట్ అయితే చేశాడు. ఇక రీసెంట్ గా మొత్తానికి తన తండ్రి చెప్పిన కథకు దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజమౌళి ఇటీవల విదేశాలకు వెళ్లి ఒక ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో డీల్ కూడా సెట్ చేసుకున్నాడు. ఏదేమైనా కూడా మహేష్ బాబు సినిమాను ఒక విజువల్ ట్రీట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి హై లెవెల్ గ్రాఫిక్స్ కూడా వాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మరొక ఆసక్తికరమైన అంశం కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతొంది. అదేమిటంటే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం యువ హీరోను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నేచురల్ స్టార్ నానిని (Nani) కూడా అనుకుంటున్నట్లుగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కథలో మాత్రం ఒక బలమైన పాత్ర కోసం మరొక యంగ్ హీరో అయితేనే బాగుంటుంది అని దర్శకుడు రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం కొంతమంది పేర్లు కూడా చర్చల్లోకి రాగా అందులో ఎక్కువగా నేచురల్ స్టార్ పైనే ఫోకస్ పడినట్లుగా తెలుస్తోంది.

ఇంతకుముందే రాజమౌళి దర్శకత్వంలో ఈగ అనే సినిమా చేసిన నాని అందులో కొద్దిసేపు కనిపించినప్పటికీ కూడా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు. అయితే ఎప్పుడైనా సరే రాజమౌళి సినిమాలో ఎలాంటి చిన్న పాత్ర వచ్చిన కూడా తాను చేయడానికి సిద్ధమే అని కూడా నాని గతంలో వివరణ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నిజంగానే అతనికి అవకాశం వస్తే నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు తో పాన్ ఇండియా ప్రాజెక్టును రాజమౌళి వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అప్పటిలోపు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేయనున్నాడు.
Published by:Sunil Boddula
First published:

Tags: Hero nani, Mahesh Babu, Trivikram

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు