Nani : తెలంగాణ యువకుడిగా నాచురల్ స్టార్ నాని.. ఇదంతా దానికోసమే..

నాని Photo : Twitter

Nani : నాచురల్ నాని వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా వస్తున్న టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. కలకత్తా నేపథ్యంలో వస్తున్న శ్యామ్ సింగరాయ్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

  • Share this:
    నాచురల్ నాని వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా వస్తున్న టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. కలకత్తా నేపథ్యంలో వస్తున్న శ్యామ్ సింగరాయ్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఆయన మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నట్టు తెలుస్తుంది. నాని గ‌తంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసం రాయ‌ల‌సీమ యాస నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక నాని నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం “టక్ జగదీష్”. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    ఆయన హీరోగా వస్తున్న మరో చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

    ఇక నాని నటిస్తున్న మరో సినిమా 'అంటే.. సుందరానికి..' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: