అవును.. నాని నిజంగానే ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తీసుకున్నాడు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో పాటు విక్రమ్ కే కుమార్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ మధ్యే సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఇక ఇప్పుడు నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేసారు. ఈ సినిమాకు ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నట్లుగానే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. టీజర్ కూడా చాలా కొత్తగా ఉంది. కమెడియన్ సత్యతో ఈ టీజర్ విడుదల చేసాడు విక్రమ్ కే కుమార్.
8 ఏళ్ల చిన్న పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వయసు ఉన్న మహిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడర్.. అతడే మన గ్యాంగ్ లీడర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడర్ కథ. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు. ఈ చిత్ర టీజర్ అదిరిపోయింది కూడా. ఒకప్పటి చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టాలనుకోవడం నిజంగా సాహసమే.
Still remember the aviators and the beard look and the welding gun in his hands :)
First day first show as a kid and the rest was history
A proud fan announcing his title today #Nani24 title is here ...@Vikram_K_Kumar @anirudhofficial @MythriOfficial pic.twitter.com/ty5Tm0QpcU
— Nani (@NameisNani) February 24, 2019
కానీ కథపై ఉన్న నమ్మకంతో దాన్ని తీసుకున్నాడు న్యాచురల్ స్టార్. ఇందులో నానితో మరో ఐదు కీలకపాత్రలు ఉంటాయి. వీళ్ల చుట్టూ తిరిగే కథ ఈ సినిమా. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Nani, Telugu Cinema, Tollywood, Vikram K Kumar