హోమ్ /వార్తలు /సినిమా /

హీరోయిన్ నివేదా థామస్‌తో న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

హీరోయిన్ నివేదా థామస్‌తో న్యూస్ 18 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

న్యూస్18తో నివేదా థామస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (News18/Photo)

న్యూస్18తో నివేదా థామస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (News18/Photo)

Nivetha Thomas News18 Exclusive Interview | తొలిసారి తెలుగులో భారీ చిత్ర‌మైన 'వీ' ఓటీటీలో రిలీజ్ కు సిధ్ద‌మవుతుంది. ఈ నెల 5 న ఆమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన నివేదా థామ‌స్ న్యూస్ 18 తో ముచ్చ‌టించారు.

ఇంకా చదవండి ...

  Nivetha Thomas News18 Exclusive Interview | కోవిడ్ ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప‌డింది...ముఖ్యంగా సినిమా రంగంపై ఈ ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంద‌నే చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సినిమా స్టైల్ నే మార్చేసింది క‌రోనా. చిన్న సినిమాలు ద‌గ్గ‌ర నుంచి పెద్ద సినిమాల వ‌ర‌కు ప్ర‌స్తుతం అంద‌రు ఓటీటీ పైనే ఆధాప‌డుతున్నారు. అందులో భాగంగా తొలిసారి తెలుగులో భారీ చిత్ర‌మైన 'వీ' ఓటీటీలో రిలీజ్ కు సిధ్ద‌మవుతుంది. ఈ నెల 5 న ఆమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన నివేదా థామ‌స్ న్యూస్ 18 తో ముచ్చ‌టించారు.

  'వీ' సినిమాలో మీ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?

  ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో అన్నింటికంటే చాలా విభిన్నంగా ఉండ‌బోతుంది. సినిమాలో నా పాత్ర నిడివి చాలా త‌క్కువ స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి అది ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు చేరుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. సినిమా మొత్తం నాది చాలా సీరియ‌స్ పాత్ర నేను ఇంత‌క‌ముందు ఇలాంటి పాత్ర చేయ‌లేదు....నా కెరీర్ లో ది బెస్ట్ క్యారెక్ట‌ర్ అని చెప్ప‌గ‌ల‌ను.

  న‌టుడు నాని తో ఇది మీకు మూడో సినిమా మ‌ళ్లీ ఆ టీమ్ తో వ‌ర్క్ చేయ‌డం ఎలా ఉంది?

  నాని తో వ‌ర్క్ చేయ‌డం ఎప్పుడు స్పెష‌లే నాకు.... ఎందుకంటే ’జెంటి‌ల్ మాన్’ తో మా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. కేవ‌లం వృత్తి ప‌రంగానే కాకుండా బ‌య‌ట కూడా మేము చాలా మంచి ప్రెండ్స్. నాకు యాక్టింగ్ లో మెళుకువ‌లు చెబుతూ ఉంటాడు నాని. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ ఇస్తే బాగుంటుందో గైడ్ చేస్తుంటాడు. వీటితోపాటు సెట్స్ లో చాలా స‌ర‌దా ఉంటారు.

  మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.... తెలుగు ఇంత‌ బాగా ఎలా నేర్చుకున్నారు?

  అంద‌రు అదే అంటున్నారు...ఏ భాషైన మాట్లాడుతూ ఉంటే వ‌చ్చేస్తోంది అండి. అలానే నేను చాలా సంవ‌త్స‌రాలుగా మాట్లాడుతున్నాను క‌దా అందుకే కాస్త తెలుగుపై ప‌ట్టు వ‌చ్చింది. ఇందులో నాతో ప‌ని చేసిన ద‌ర్శ‌కుల స‌హాయం కూడా చాలా ఉంది ఏ పదం ఎలా ప‌ల‌కాలి అనేవి నాకు నేర్పించారు. ఇప్పుడు నా సినిమాల‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకోగ‌ల‌గుతున్నాను.

  ఇంత భారీ సినిమా ఇలా ఓటీటీపై విడుద‌ల‌వ‌డం ఎలా అనిపిస్తోంది? ఏమైన ఫీల్ అవుతున్నారా?

  ఖ‌చ్చితంగా బాధ‌గానే ఉంది. ‘వీ’ అనే సినిమా ధియేట‌ర్స్ లో చూడాల్సిన సినిమా. అందులో చూస్తేనే ఆ ఫీల్ ప్రేక్ష‌కులు పొంద‌గ‌ల‌గుతారు. అలాంటి సినిమా ఇలా చిన్న స్క్రీన్ పై విడుద‌ల అవ‌డం ఖ‌చ్చితంగా బాధ‌గానే ఉంటుంది. కానీ ప్రస్తుతం మ‌న చేతిలో వేరే మార్గం లేదు కాబ‌ట్టి ఏం చేయలేం. బ‌ట్ మీరు ఓటీటీ పై చూసిన ఈ సినిమా మీకు ఖ‌చ్చితంగా మంచి ఫీల్ ఇస్తుంద‌ని గ‌ట్టిగ చెప్ప‌గ‌ల‌ను.

  నానీ పై ఇండ్ర‌స్టీలో ఒక కంప్లైట్ ఉంది... సెట్స్ లో ఫోన్ తో ఎక్కువ ఉంటాడు అని ....ఆ అల‌వాటు మిమ్మ‌ల్ని ఎప్పుడైన ఇబ్బంది పెట్టిందా?

  అయ్యో... ఇది స‌ర‌దాగా నాని పై చేసిన వ్యాఖ్య‌లు.  అవి ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌న అంద‌రికి కొన్ని అల‌వాట్లు ఉంటాయి. మీకు, నాకు క‌దా అలానే నానికి కూడా ఉంది . అయితే నేనేప్పుడు ఆ అల‌వాటుతో ఇబ్బందిప‌డ్డ సంద‌ర్భాలు లేవు.

  ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహాన కృష్ట‌తో ఇది మీకు రెండో సినిమా మ‌ళ్లీ అదే ద‌ర్శ‌కుడుతో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?

  మోహాన్ సార్ ద‌గ్గ‌ర చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప‌నిలో ఖ‌చ్చిత‌త్వాన్ని కోరుకునే వ్య‌క్తి. అంతే కాకుండా న‌టీ న‌టుల నుంచి కూడా సెట్స్ లో ఇన్ పుట్స్ తీసుకుంటారు.  సీన్ ఇంకా ఎలా బాగా చేయోచ్చు నువ్వు ఏమైన అనుకుంటున్నావా? అని అడిగిమ‌రి న‌టుల‌ను స్క్రిప్ట్‌‌లో భాగ‌స్వామ్యం చేస్తారు.

  చివ‌రిగా ఈ సినిమా గురించి ప్రేక్ష‌కుల‌కు ఏం చెప్ప‌ద‌ల్చుకున్నారు?

  అంద‌రికి ఈ సినిమా మంచి కిక్ ఇస్తోంది....ప్యామిలీ మొత్తం తిన‌డానికి అన్ని ప‌క్క‌న పెట్టుకొని అంద‌రు క‌లిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. నాని అండ్ సుధీర్ బాబు స‌న్నివేశాలు మీకు మంచి థ్రిల్‌ను ఇస్తాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Amazon prime, Dil raju, Indraganti Mohana Krishna, Nani, Nani V Movie, Nivetha Thomas, Sudheer Babu, Tollywood

  ఉత్తమ కథలు