హోమ్ /వార్తలు /సినిమా /

Tuck Jagadish on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో నాని టక్ జగదీష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Tuck Jagadish on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో నాని టక్ జగదీష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Tuck Jagadish on Amazon Prime Photo : Twitter

Tuck Jagadish on Amazon Prime Photo : Twitter

Tuck Jagadish on Amazon Prime : నాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే.

నాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్స్‌ను బట్టి చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్రబృదం ప్రకటించింది. అయితే ఓ వైపు కరోనా మరోవైపు టికెట్ రేట్స్ ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ బాట పట్టనుందని తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. దీంతో టక్ జగదీష్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని టాక్. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమానకు థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడట. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. నాని ఈ మూవీతో పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.ఇది కూడా చూడండి : Aashita Singh : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్ డూప్లికేట్... పిక్స్ వైరల్..

ఇటీవలే శ్యామ్ సింగరాయ్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఆయన మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

First published:

Tags: Amazon prime, Tollywood news, Tuck Jagadish

ఉత్తమ కథలు