Home /News /movies /

NANI TUCK JAGADISH MOVIE UNIT CLARIFIES THIS MOVIE RELEASED FIRST THEATRES ONLY NOT OTT PLATFORM TA

Nani Tuck Jagadish: ఓటీటీలో నాని ‘టక్ జగదీష్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

‘టక్ జగదీష్’( Nani/Twitter)

‘టక్ జగదీష్’( Nani/Twitter)

Nani Tuck Jagadish: ఓటీటీలో నాని ‘టక్ జగదీష్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్.. వివరాల్లోకి వెళితే..

    Nani Tuck Jagadish: ఓటీటీలో నాని ‘టక్ జగదీష్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్.. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకు పడుతోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇపుడిపుడే కరోనా ఉదృతి తగ్గుతోంది. కరోనాతో సామాన్య జనాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఎన్నో నష్టాలను ఫేస్ చేస్తోంది. ఈ రూట్లోనే సినిమా వాళ్లకు ఓటీటీ అనేది అద్భుతమైన వేదికగా దొరికింది. గతేడాది కరోనా ఉదృతి ఉన్న సమయంలోనే నాని హీరోగా నటించిన ‘వీ’ సినిమాను ఓటీటీలో విడుదల చేసారు. అక్కడ ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను మూట గట్టుకుంది. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ధించుకోలేకపోయారు. ఇక అది అలా ఉంటేగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా కంప్లీట్ చేసారు.

    కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఈ పాటికి ఈ సినిమా విడుదలై ఉండేది. తాజాగా ఈ సినిమాను నాని గత సినిమా ‘వీ’లాగానే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను పరిస్థితులు అనుకూలించిన తర్వాత థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే పుకార్లకు పులిస్టాప్ పెట్టారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు.

    ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించబోతున్నారు.నాని ఈ మూవీలతో  పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nani, Shiva Nirvana, Tollywood, Tuck Jagadish

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు