Home /News /movies /

NANI TUCK JAGADISH GETS CRAZY RESPONSE WORLD TELEVISION PREMIERE OF TUCK JAGADISH ON STAR MAA GETS TEN TRP SR

Nani : నానికి అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియెన్స్.. టక్ జగదీష్‌కు అక్కడ బ్రహ్మరథం..

Nani Tuck Jagadish Photo : Twitter

Nani Tuck Jagadish Photo : Twitter

Tuck Jagadish : టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజై ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సందడి చేసింది. టీవీతెరపై ఈ సినిమా తన సత్తాను చాటిందని అంటున్నారు.

ఇంకా చదవండి ...
  నాచురల్ స్టార్ (Nani) నాని హీరోగా రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్‌గా నటించిన ఫ్యామిలీ డ్రామా (Nani Tuck Jagadish) టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజై ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సందడి చేసింది. టీవీతెరపై ఈ సినిమా తన సత్తాను చాటిందని అంటున్నారు. తాజాగా స్టార్ మాలో ప్రసారమైన టక్ జగదీష్ చిత్రం 10.90 టీఆర్పీని సాధించి కేక పెట్టించింది. దీంతో మరోసారి నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ అండ భారీగా ఉందనేది రుజువైంది. టక్ జగదీష్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మించారు. నాని సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించగా కీలకపాత్రల్లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబులు కనిపించారు.

  ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ రిలీజ్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.


  ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'ఏదో ఏదో' అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్‌ మంచి వినసొంపైన సంగీతం అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా.. చైత్ర అంబడిపుడి పాడారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. నాని, హీరోయిన్ కృతి శెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది.

  Balakrishna : బాలయ్య దమ్ము ఏంటో మరోసారి నిరూపితం... రికార్డ్స్ బద్దలు..

  ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hero nani, Shyam Singha Roy, Tollywood news, Tuck Jagadish

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు