నాచురల్ స్టార్ నాని ఈ యేడాది వి అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి పరవాలేదనిపించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘V’ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ఓటీటీలో విడుదలవ్వడంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. అయితే ఈ సినిమా కనుక ఒకవేళా థియేటర్లో విడుదలైతే ఫలితం వేరేలాగా ఉండేదని అంటారు ఈ సినిమా ఫ్యాన్స్. అందులో భాగంగా ఈ సినిమాను త్వరలో థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ధించుకోలేకపోతున్నారు. ఇక అది అలా ఉంటే తాజాగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో నాని పాల్గొంటున్నాడు. మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా విడుదలైనా ఈ పోస్టర్ ను చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు.
ఆ పోస్టర్లో నాని టక్ లుక్ లో భోజనం ముందు కూర్చొని వెనక నుంచి కత్తి తీస్తూ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్‌తో పాటు ఈ సారి ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం పేర్కోన్నాడు నాని. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి రేస్ లో విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. ఇక నాని ఇతర సినిమాల విషయానికి వస్తే.. ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. పిరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని విజయదశమి సందర్భంగా విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతం అందించబోతున్నారు.
నాని ఈ మూవీతో పాటు 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ని చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఇటీవల ప్రీలుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక పోయిన సంవత్సరం నాని గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా టెక్నికల్‌గాను, కథ పరంగానే బాగున్నప్పటికి.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక నాని, మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా నాని కెరీల్లోని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మారుతి కూడా తన సినిమాల తీరును మార్చుకున్నాడు. క్లీన్ ఎంటర్ టైనర్స్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఆ సూపర్ హిట్ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరోసారి కలిసి వర్క్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ టైమ్ ఇప్పుడోచ్చింది. వీరి కాంబినేషన్ మళ్లీ ఓ పట్టాలెక్కనుంది. అందులో భాగంగా మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ఈ లాక్ డౌన్ సమయంలో మారుతి నానికి కథ చెప్పాడట.. మారుతి చెప్పిన కథ నానికి నచ్చడంతో.. నాని కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.