వెబ్ సీరిస్‌‌ను నిర్మించనున్న మరో యువ హీరో.. ఆ దిశగా అడుగులు..

నాని Photo : Twitter

Nani : నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సీఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

  • Share this:
    నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలయికలో రాబోతున్న ‘వి’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సీఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒక వేళా థియేటర్స్ ఓపెన్ చేసిన జనాలు సినిమాల్నీ థియేటర్స్ వచ్చి మునపటి లాగా చూసే పరిస్థితి లేదు. దీంతో ఎప్పుడో విడుదలకావాల్సిన సినిమాలు వరుసగా ఓటీటీ బాట పడుతున్నాయి. అందులో ఇటీవల చాలా సినిమాలు అమెజాన్, అహా, నెట్ ఫ్లిక్స్ లాంటీ స్ట్రీమింగ్ సంస్థలతో జత కట్టి సినిమాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా వి కూడా అదే బాటలో ప్రేక్షకుల్నీ అలరించనుంది. ఈ వి సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమా హీరో నాని ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తను రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌ను రూపొందించే యోచనలో ఉన్నానని తెలిపాడు. ఇక తన ‘వి’ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల అవుతుందని తాను ముందే భావించానని, ఇప్పుడు అది జరుగుతోందని నాని చెప్పుకొచ్చాడు.

    ఈ వెబ్ సీరిస్‌ను నిర్మించే బిజినెస్‌లోకి ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ లాంటీ ప్రముఖులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ ఇద్దరి కలయికలో ఓ వెబ్ సిరీస్ రూపోందనుంది. అలాగే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కూడా ఈ రంగంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: