అవును నిజం..ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఆ తరహా పాత్రలు చేసారు. ఇపుడు నాని వంతు వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆడియన్స్‌ను మెప్పించారు.
ఇప్పటి జనరేషన్లో ఎన్టీఆర్..‘ఆంధ్రావాలా’, ‘శక్తి’ వంటి సినిమాల్లో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేసాడు.
ఆ తర్వాత ప్రభాస్ కూడా ‘బాహుబలి’ సిరిస్‌లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించాడు.
ఇక మహేష్ బాబు విషయానికొస్తే..ఎస్.జే.సూర్య దర్శకత్వంలో చేసిన ‘నాని’ సినిమాలో మహేష్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు.
ఆ తర్వాత ‘కిక్2’ లో రవితేజ కూడా తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తండ్రికొడుకులుగా డ్యూయల్ రోల్ చేయబోతున్న హీరోల లిస్టులో నాని కూడా జాయిన్ అవుతున్నాడు.
ప్రస్తుతం నాని..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని..రంజీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ కొడుకు యాంగిల్లో తండ్రి స్టోరీని ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతాడంట.
మరి తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో వెండితెరపై నాని ఏరకంగా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.
అనుపమ పరమేశ్వరన్ క్యూట్ ఫోటోస్
ఇవి కూడా చదవండి
మాస్‌రాజా రవితేజకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..
ప్రేమ కావాలంటోన్న సల్మాన్ ఖాన్.. ఈ సారైనా దొరుకుతుందా..?
ప్రభాస్ దర్శకత్వంలోనే అఖిల్ సినిమా.. ఫ్యాన్స్‌కు పండగే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.