Home /News /movies /

NANI SUDHEER BABU V FILM TO STREAM ON AMAZON PRIME OFFICIALLY ANNOUNCED SR

Nani-Sudheer Babu : అమెజాన్ ప్రైమ్‌లో వి సినిమా.. చిత్రబృందం అధికారిక ప్రకటన..

వి సినిమా పోస్టర్ (V movie)

వి సినిమా పోస్టర్ (V movie)

Nani-Sudheer Babu : మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వి చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మల్టీస్టారర్ 'V'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్‌. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఎప్పుడో ఉగాదికి రావాల్సిన 'వి' సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది.  వి సినిమాను విడుదల చేసేందుకు కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అదిరిపోయే ఆఫర్స్ వచ్చినా దిల్ రాజు.. వాటికి నో చెప్పాడు. తన సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు. అయితే  ఈ సినిమా సెప్టెంబరు 5న V సినిమా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని.. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేశాడు నాని.  అమెజాన్ ప్రైమ్ చాలా పెద్ద ఆపర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో దిల్ రాజు ఒప్పుకోక తప్పలేదు.






    మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఒకవేళా సినిమా థియేటర్స్‌ను ఓపెన్ చేసిన జనాలు ఏమాత్రం సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూస్తారో.. తెలియని స్థితి. కరోనా కారణంగా మునపటి వలే ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఇక ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే.. ఈ సినిమా తీవ్ర నష్టాల్నీ కలిగిస్తుంది నిర్మాతలకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాడానికి సరే అన్నాడట. వి సినిమా బడ్జెట్‌కి మించి.. అమెజాన్ ఆఫర్ చేయడం కూడా దిల్ రాజును ఒప్పించాడానికి కారణం కావోచ్చు. ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. అయితే అమెజాన్ 33 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడా అమెజాన్ ఆఫర్ ను కాదనలేక సినిమాని ఓటీటీలో ప్రసారం చేయడానికి సరే అన్నాడట.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nani, Sudheer Babu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు