• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NANI SUDHEER BABU V FILM SEEMS LIKE IT DIRECTLY RELEASES IN AMAZON PRIME HERE ARE THE DETAILS SR

అమెజాన్ ప్రైమ్‌లో నాని సుధీర్ బాబు V సినిమా.. దిల్ రాజుకు అదిరిపోయే ఆఫర్..

అమెజాన్ ప్రైమ్‌లో నాని సుధీర్ బాబు V సినిమా.. దిల్ రాజుకు అదిరిపోయే ఆఫర్..

నాని వి సినిమా (nani v movie)

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి టీజర్, ట్రైలర్స్, పాటలు కూడా విడుదలైయాయి. అంతేకాదు మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్ కారణంగా ఉగాది కానుకగా ఈ నెల 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కరోనా తీవ్రత తగ్గిన తర్వాత విడుదల చేద్దాం అని భావించారు. కానీ రోజు రోజుకు కరోనా ఇంకా పెరుగుతూనే ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత లాక్ డౌన్ మరికొన్ని రోజులు కొనసాగించే ఆస్కారం ఉంది. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదలకాక పోతే ఆ ప్రోడ్యూసర్ తీవ్రంగా నష్టపోతాడు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది అలా ఉంటే ప్రస్తుత లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున.. అమెజాన్ స్ట్రీమింగ్ సంస్థ వి సినిమా నిర్మాత దిల్ రాజుకు ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. సినిమా ఎట్లాగు విడుదల అయ్యే అవకాశం లేదు కనుక డైరెక్ట్‌గా వి సినిమాను ప్రైమ్‌లో విడుదలకు దాదాపు 35 కోట్లకు ఆఫర్ చేసిందట. చూడాలి మరీ దిల్ రాజు థ్రియేట్రికల్ రిలీజ్ చేస్తాడ.. లేదా డైరెక్ట్‌గా అమోజాన్‌లో రిలీజ్ చేస్తాడ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు