నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ 'V'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్. ఈ సినిమా ఎప్పుడో ఉగాదికి రావాల్సిన కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. దీంతో వి సినిమాను విడుదల చేసేందుకు కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అదిరిపోయే ఆఫర్స్ వచ్చినా మొదట దిల్ రాజు.. వాటికి నో చెప్పాడు. తన సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు. అయితే ప్రస్తుత పరిస్ధితుల కారణంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే.. ఆ సినిమా తీవ్ర నష్టాల్నీ కలిగిస్తుంది నిర్మాతలకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాడానికి సరే అన్నాడట. వి సినిమా బడ్జెట్‌కి మించి.. అమెజాన్ ఆఫర్ చేయడం కూడా దిల్ రాజును ఒప్పించాడానికి కారణం కావోచ్చు. ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. అయితే అమెజాన్ 33 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ఇక డిజిటల్లో విడుదలైన వి పరవాలేదనిపించింది. టాక్ నెగటివ్ గా ఉన్నా చాలా మంది చూస్తుండటం విశేషం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబందించి మరో డీల్ జరిగింది. రీసెంట్ గా వి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. దాదాపు ఈ సినిమా 8 కోట్ల రేటు దక్కించుకుందని టాక్. దీనికి తోడు ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడుపోయాయట. ఈ సినిమా కి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఎకంగా 8.4 కోట్ల డీల్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.