హోమ్ /వార్తలు /సినిమా /

Nani V Movie Trailer Talk: నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ ట్రైలర్ టాక్..

Nani V Movie Trailer Talk: నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ ట్రైలర్ టాక్..

నాని,సుధీర్ బాబు ‘V’ సినిమా (nani sudheer V movie)

నాని,సుధీర్ బాబు ‘V’ సినిమా (nani sudheer V movie)

Nani V Movie Trailer Talk: నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి  మోహన్ కృష్ణ కలయిలో తెరకెక్కిన చిత్రం ‌ 'వి'. త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి  మోహన్ కృష్ణ కలయిలో తెరకెక్కిన చిత్రం ‌ 'వి'.  అంతా బాగుంటే ఉగాదికి ఈ సినిమా రిలీజై ఈ పాటికీ టీవీల్లో కూడా ఈ సినిమా వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కాలేదు. ఇప్పట్లో కరోనా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గినా.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూసే పరిస్థితిలు లేవు. అందుకే ఈ సినిమాను వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు తెలుగులో భారీ సినిమాలు ఏవీ కూడా ఓటిటిలో విడుదల కాలేదు. చిన్నాచితకా సినిమాలు మినహా పెద్ద సినిమాలు అయితే ఓటీటీలో రాలేదు. థియేటర్స్ ఓపెన్ చేస్తారు.. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతోనే నిర్మాతలు కనిపిస్తున్నారు. కానీ ఆ మంచి రోజులు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. అందుకనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి ముందు కొచ్చారు నిర్మాత దిల్ రాజు.తాజాగా ‘వీ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.

  హలో మైక్ టెస్టింగ్ 123, 123. ఏం చేసినా ఎంటర్టైనింగ్‌గా చేయాలనేది నా పాలసీ అని నాని వాయిస్‌తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. మాములుగా సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు అని సుధీర్ బాబు చెప్పడం ఈ సినిమాపై ఆసక్తికలిగేలా చేయడంలో ఇంద్రగంటి సక్సెస్ అయ్యారు. మరోవైపు నాని ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది అని చెప్పే డైలాగ్ బాగుంది.‘అష్టాచెమ్మా’ ‘జెంటిల్మెన్’ సినిమాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ, నాని  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు. ఈ చిత్రంలో నాని గడ్డంతో రఫ్‌ లుక్‌తో అదరగొడుతున్నాడు.  తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నాని ఆవిష్క‌రిస్తున్నాడు.

  నాని వి సినిమా (nani sudheer V movie)
  నాని వి సినిమా (nani v movie)

  మొత్తంగా హత్యలు చేసే సైకో. అతన్ని పట్టుకోవాలనుకునే పోలీస్ ఆఫీసర్ కథ ‘వీ’ మూవీ. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు నాని నటన ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్‌లో చూపెట్టాడు.ముఖ్యంగా ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు అనే డైలాగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.  ఈ సినిమాలో నాని రాక్షసుడుగా ఉంటే సుధీర్‌బాబు రక్షకుడుగా అలరించనున్నాడు. ఇంతకు ముందు `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. హీరోయిన్స్‌గా నివేదా థామస్, అతిథి రావు హైదరీ నటిస్తున్నారు.  మొత్తంగా ఎన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aditi Rao Hydary, Amazon prime, Dil raju, Indraganti Mohana Krishna, Nani, Nani V Movie, Nivetha Thomas, Sudheer Babu

  ఉత్తమ కథలు