రాక్షసుడుగా నాని.. రక్షకుడుగా సుధీర్ బాబు.. అదిరిన ‘V’ మూవీ టీజర్

Nani V Movie Teaser Talk | నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 'వి' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

news18-telugu
Updated: February 17, 2020, 5:54 PM IST
రాక్షసుడుగా నాని.. రక్షకుడుగా సుధీర్ బాబు.. అదిరిన ‘V’ మూవీ టీజర్
నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ టీజర్ (Twitter/Photo)
  • Share this:
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 'వి' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అపుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంటే అని సుధీర్ బాబు చెప్పిన డైలాగ్‌తో ఈ మూవీ టీజర్ మొదలైంది.  ‘అష్టాచెమ్మా’ ‘జెంటిల్మెన్’ సినిమాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ, నాని  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు. ఈ చిత్రంలో నాని గడ్డంతో రఫ్‌ లుక్‌తో అదరగొడుతున్నాడు.  తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నాని ఆవిష్క‌రిస్తున్నాడు.

ఈ సినిమాలో నాని రాక్షసుడుగా ఉంటే సుధీర్‌బాబు రక్షకుడుగా అలరించనున్నాడు. ఇంతకు ముందు `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. వి సినిమా నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌ం. షూటింగ్ పూర్త‌ి చేసుకున్న ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 17, 2020, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading