Nani- Sudheeer Babu V movie on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో V సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Nani- Sudheeer Babu V movie on Amazon prime :నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మల్టీస్టారర్ 'V'.

news18-telugu
Updated: August 13, 2020, 9:51 AM IST
Nani- Sudheeer Babu V movie on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో V  సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
వి సినిమా పోస్టర్ Photo : Twitter
  • Share this:
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మల్టీస్టారర్ 'V'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్‌. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఎప్పుడో ఉగాదికి రావాల్సిన 'వి' సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. దీంతో వి సినిమాను విడుదల చేసేందుకు కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అదిరిపోయే ఆఫర్స్ వచ్చినా దిల్ రాజు.. వాటికి నో చెప్పాడు. తన సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించాడు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబరు 5న V సినిమా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోందన్నది తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ చాలా పెద్ద ఆపర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో దిల్ రాజు ఒప్పుకోక తప్పలేదట.

nani sudheer babu indraganti mohana krishna v movie teaser released,nani sudheer babu v movie teaser,V movie teaser talk,nani V movie teaser,Nani V Movie Teaser Talk,Nani and Mohankrishna Indraganti film v first look out,nani's v the movie teaser, nani v movie first look, nani sudheer babu movie, nani hindi dubbed movies 2019, nani 25th movie v, telugu full movies, actor nani movies, v the movie, nani hit movies, nani 25th movie opening, jersey movie, nani nivetha thomas movie, nani 25th movie name, nani latest movie, nani v movie trailer, nani v movie teaser, nani 25th v movie, nani movie, nani 25th movie, nani v movie, nani new movie, v movie, nani, nani movies, movie stories, tollywood movie news, latest telugu movie updates, nani latest movies, latest movie news, tollywood movie updates, latest updates, sudheerbabu, natural star nani v movie first look teaser, natural star nani,నాని,సుధీర్ బాబు,వీ మూవీ టీజర్,నాని వీ మూవీ టీజర్ టాక్,ఇంద్రగంటి మోహనకృష్ణ,నాని,వీ మూవీ,నాని వీ తెలుగు సినిమా,ఇంద్రగంటి మోహనకృష్ణ,సుధీర్ బాబు,అదితి రావు హైదరీ,నివేదా థామస్,వీ మూవీకి గుమ్మడికాయ,వీ మూవీ టీజర్ టాక్
నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ టీజర్ (Twitter/Photo)


మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఒకవేళా సినిమా థియేటర్స్‌ను ఓపెన్ చేసిన జనాలు ఏమాత్రం సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూస్తారో.. తెలియని స్థితి. కరోనా కారణంగా మునపటి వలే ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఇక ఒక సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే.. ఈ సినిమా తీవ్ర నష్టాల్నీ కలిగిస్తుంది నిర్మాతలకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాడానికి సరే అన్నాడట. అందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగిపోయాయని సమాచారం. వి సినిమా బడ్జెట్‌కి మించి.. అమెజాన్ ఆఫర్ చేయడం కూడా దిల్ రాజును ఒప్పించాడానికి కారణం కావోచ్చు. ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. అయితే అమెజాన్ 33 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ఈ నేపథ్యంలో దిల్ రాజు కూడా అమెజాన్ ఆఫర్ ను కాదనలేక సినిమాని ఓటీటీలో ప్రసారం చేయడానికి సరే అన్నాడని టాక్. అంతేకాదు అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Published by: Suresh Rachamalla
First published: August 13, 2020, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading