Home /News /movies /

NANI SRI REDDY ONCE AGAIN SRI REDDY TARGETED THE HERO NANI PAWAN KALYAN CHANDRABABU SEEMS TO BE READING THE SCRIPT TA

Nani - Sri Reddy : మరోసారి హీరో నానిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ..

నానిపై విరుచుకపడ్డ శ్రీ రెడ్డి (File/Photo)

నానిపై విరుచుకపడ్డ శ్రీ రెడ్డి (File/Photo)

Nani - Sri Reddy : మరోసారి హీరో నానిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ మరోసారి నానిపై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.

  Nani - Sri Reddy : మరోసారి హీరో నానిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ మరోసారి నానిపై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది శ్రీరెడ్డి. అంతేకాదు టాలీవుడ్‌లో పలువురు హీరోలతో పడక సుఖాన్ని పంచుకున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమలో పెను దుమారాన్నే రేపింది. ఈమె ఎపుడు పవన్ కళ్యాణ్, నాని, దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి టికెట్ రేట్స్ విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది.

  ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఫీజు  విషయంలో లేని ఆంక్షలు సినిమా టిక్కెట్స్ విషయంలో ఎందుకు అంటూ కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మూవీ అనేది లగ్జరీ. ప్రేక్షకుడు తనకు నచ్చితే.. ఎంత రేటు పెట్టైనా సినిమాకు వెళాతారు. అది ప్రేక్షకుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇష్టం ఉంటే ఆ ధర పెట్టి సినిమా చూస్తాడు. లేకపోతే థియేటర్స్ వైపు చూడను కూడా చూడరు.

  AP Movie Tickets Issue:రెమ్యునేరషన్ తగ్గుతుందని వారి భయం.. పవన్, నానిపై మంత్రి అనిల్ ఫైర్..


  కానీ ఏపీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో టికెట్స్ రేటు తగ్గించినట్టు తన వాదనలు వినిపిస్తోంది. కానీ ఏపీలోని పల్లెలు, మారుమూల గ్రామాల్లోని థియేటర్స్‌లో చాలా మంది థియేటర్స్ యజమానులు పెద్ద సినిమాల విడుదల తొలి రోజు రూ. 70 ఉన్న టిక్కెట్స్‌ను రూ. 300 వరకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.

  BalaKrishna - Vijayashanti : మరోసారి వెండితెరపై జోడిగా బాలకృష్ణ, విజయశాంతి..


  టాక్ బాగుంటే.. వరుసగా ఆది వారం వరకు అక్కడ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు చచ్చినట్టు రూ. 300 పెట్టి సినిమా చూస్తున్నారు. దీంతో ఇన్‌డైరెక్ట్‌గా సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రభుత్వానికి ఎలాంటి లాభం ఉండటం లేదు. ఈ డబ్బులన్ని థియేటర్స్ యజామానుల జేబుల్లోకి వెళుతున్నాయి. దీనిపై స్థానికంగా ఎలాంటి కంట్రోల్ కూడా లేదు.  పైగా థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ స్పెషల్ షోలు కూడా వేస్తున్నారు. దీనికి స్థానికంగా ఉండే నాయకులు, పోలీసులు అండగా నిలుస్తున్నారనే కామెంట్స్ వినబడుతున్నాయి.

  Balakrishna - Nagarjuna : నాగార్జునకు బిగ్‌షాక్ ఇచ్చిన బాలకృష్ణ.. నందమూరి Vs అక్కినేని..


  తాజాగా నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల సందర్భంగా టికెట్ రేటు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమిస్తున్నారంటూ కామెంట్ చేశారు. దీనిపై ఇప్పటికే ఏపీ మంత్రులు అనిల్, బొత్స .. తనదైన శైలిలో నానిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. టిక్కెట్స్ రేట్స్ తగ్గిస్తే.. ప్రేక్షకులను అవమానపరిచినట్టు ఎలా అవుతుందనే లాజిక్ మాట్లాడింది. నాని .. కావాలనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కనుసన్నల్లో తమ సామాజిక వర్గానికి మద్ధతుగానే ఈ వ్యాఖ్యలు చేసారని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

  Sounth Remakes in Bollywood : ‘జెర్సీ’ సహా హిందీలో క్యూ కడుతున్న సౌత్ సూపర్ హిట్ సినిమాలు ఇవే..

  నాని నిజంగా బాధ పడి అలా అన్నాడో తెలియడం లేదు. ఒకవేళ నాని సినిమా థియేటర్స్ విషయంలో బాధపడుతూ ఉంటే..అంతకు ముందు ‘V’, ‘టక్ జగదీష్’ సినిమాలను నిర్మాతల బాగు కోసమే ఓటీటీలో విడుదల చేసినట్టు చెప్పారు. అప్పట్లో ఈయన థియేటర్స్ యజమానులను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో కొంత మంది నాని సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయం అని తీర్మాణం చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత నాని థియేటర్స్ ఓనర్స్‌కు   క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే కదా.

  Radhe Shyam Pre Release Events Highlights : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..

  ఒకప్పుడు థియేటర్స్ యాజమాన్యంపై అలా మాట్లాడిన నాని..  ప్రస్తుతం మాత్రం వారిపై కపట ప్రేమ నటిస్తూ థియేటర్ యజమానుల పై ప్రేమ కురిపిస్తాడంటూ వ్యాఖ్యలు చేసింది. నాని అప్పట్లో తాను అన్న మాటలను మరిచిపోయి మాట్లాడుతున్నారా లేక పోతే ప్రజలను పిచ్చివారిని చేస్తున్నారా నాకు అర్థం కావడం లేదు అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఇది పనవ్ కళ్యాణ్, చంద్రబాబు కనుసన్నల్లో రెడీ చేసిన స్క్రిప్ట్‌ను నాని చదివారా అంటూ శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. ఐతే..  ఏపీ గవర్నమెంట్‌తో , అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు   కలిసికట్టుగా టికెట్ల విషయంలో ఒక రాజీకీ వస్తున్న సమయంలో నాని ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని శ్రీరెడ్డి తెలిపింద. ఈమె వ్యాఖ్యలపై నాని స్పందిస్తారా లేదా అనేది చూడాలి. మొత్తంగా నానిపై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nani, Shyam Singha Roy, Sri Reddy, Tollywood

  తదుపరి వార్తలు