Shyam Singha Roy : క్రిస్మస్ కానుకగా నాని శ్యామ్ సింగ రాయ్.. అధికారిక ప్రకటన..

Shyam Singha Roy Photo : Twitter

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

  • Share this:
    నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా మొన్నటి వరకు ఓటీటీలో విడుదలకానున్నట్లు టాక్ నడిచింది. అయితే నాని తాజాగా ఈ సినిమా థియేటర్ విడుదల తేదిని ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని పేర్కోన్నారు.

    ఇక్కడ మరో విషయం ఏమంటే డిసెంబర్ 17న అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విడుదలవుతోంది. అంటే ఓ వారం గ్యాపులో రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అంతేకాదు బాలకృష్ణ అఖండ కూడా ఇదే నెలలో విడుదలకానుందని అంటున్నారు.



    శ్యామ్ సింగ రాయ్‌లో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ, మాస్ట్రో సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

    అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    Telugu Movies : ఈ వారం థియేటర్‌లో, ఓటీటీలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..

    ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

    ఇక నాని తాజా సినిమా టక్ జగదీష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్‌ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది.

    Keerthy Suresh : కీర్తి సురేష్ అభిమానులకు శుభవార్త.. నవంబర్‌లో ముహూర్తం..

    ఇక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: