Home /News /movies /

NANI SHYAM SINGHA ROY SENT FOR OSCAR NOMINATIONS IN 3 CATEGORIES TA

Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో మరో రికార్డు.. ఆస్కార్‌కు 3 విభాగాల్లో నామినేషన్..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ మరో రికార్డు (Nani Shyam Singha Roy Photo : Twitter)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ మరో రికార్డు (Nani Shyam Singha Roy Photo : Twitter)

Shyam Singha Roy :   నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ వేదికగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు మూడు విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. .

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Shyam Singha Roy :   నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) . టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్నిపీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అటు ఈ సినిమా నెట్‌ప్లిక్స్  ఓటీటీలోకి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

    అంతేకాదు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా నె‌ట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన  వారం రోజుల్లోనే  ఎక్కువ మంది వీక్షించిన భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

    SIIMA AWARDS 2021 : సైమా అవార్డ్స్ 2021 నామినేషన్స్ ప్రకటన.. పుష్ప, అఖండ జోరు..


    అంతేకాదు గ్లోబల్ లెవల్లో టాప్ 3లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ట్రెండ్ అవుతున్న విషయాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ వ్యాప్గా మూడో ప్లేస్ అందుకున్న ఒకే చిత్రం అంటూ ట్వీట్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమా ఈ ఘనత సాధించడానికి మరో కారణం ఉంది. బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో బడా సినిమాలేవి విడుదల కాలేదు. అల్లు అర్జున్.. ’పుష్ప’.. బాలకృష్ణ.. ’అఖండ’ వేరే ఓటీటీ వేదికగా విడుదల కావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో మరో భారతీయ సినిమా లేకపోవడం.. ఈ సినిమా ఒకేసారి మూడు భాషల్లో స్ట్రీమింగ్ కావడంతో ఈ సినిమా ఈ అరుదైన ఘనత సాధించిందనే చెప్పాలి.

    Minister Roja Daughter: మినిష్టర్ రోజా కూతురు అన్షు మాలికి సినీ ఎంట్రీకి అంతా సిద్ధం.. హీరో ఎవరంటే..?


    తాజాగా ఈ సినిమా ఆస్కార్‌కు 3 మూడు విభాగాల్లో నామినేట్ అయినట్టు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. ఒక పీరియాడిక్ డ్రామా, రెండో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మూడు క్లాసికల్ కల్చరల్ డాన్స్ ఈ మూడు విభాగాల్లో ఈ సినిమా నామినేషన్ దక్కించుకుంది. ఫైనల్ లిస్టులో చివరి ఐదు చిత్రాల్లో చోటు దక్కించుకొని ఫైనల్‌గా అవార్డు కైవసం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. శ్యామ్ సింగ రాయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 19.67 కోట్లు షేర్ (రూ. 33.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో కలిపి రూ. 6.83 కోట్లు వసూళు చేసింది. ఓవరాల్‌గా థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా రూ. 26.50 కోట్ల షేర్ (రూ. 46.80 కోట్లు గ్రాస్) వసూళ్లను  రాబట్టింది. ఈ సినిమా రూ. 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 4 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Nani, OSCAR, Shyam Singha Roy, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు