Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) . టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిపీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈఈ సినిమా గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా జనవరి 21 నుంచి నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో గత వారం రోజులుగా ఎక్కువ మంది వీక్షించిన భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
అంతేకాదు గ్లోబల్ లెవల్లో టాప్ 3లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ట్రెండ్ అవుతున్న విషయాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ వ్యాప్గా మూడో ప్లేస్ అందుకున్న ఒకే చిత్రం అంటూ ట్వీట్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమా ఈ ఘనత సాధించడానికి మరో కారణం ఉంది. బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో బడా సినిమాలేవి విడుదల కాలేదు. అల్లు అర్జున్.. ’పుష్ప’.. బాలకృష్ణ.. ’అఖండ’ వేరే ఓటీటీ వేదికగా విడుదల కావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో మరో భారతీయ సినిమా లేకపోవడం.. ీ సినిమా ఒకేసారి మూడు భాషల్లో స్ట్రీమింగ్ కావడంతో ఈ సినిమా ఈ అరుదైన ఘనత సాధించిందనే చెప్పాలి.
శ్యామ్ సింగ రాయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 19.67 కోట్లు షేర్ (రూ. 33.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్లో కలిపి రూ. 6.83 కోట్లు వసూళు చేసింది. ఓవరాల్‌గా థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ సినిమా రూ. 26.50 కోట్ల షేర్ (రూ. 46.80 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రూ. 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 4 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ. 50 కోట్లతో నిర్మించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏదేమైనా కూడా సరైన సమయంలో మంచి విజయం అందుకున్నాడు నాని. ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్గా కంప్లీటైంది.
‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.