Shyam Singha Roy - Nani : గత కొన్నేళ్లుగా సినిమాలో కంటెంట్ కంటే వివాదాస్పద సన్నివేశాలు లేదా డైలాగ్స్‌లతో వార్తల్లో నిలుస్తున్నారు. దర్శక,నిర్మాతలు, హీరోలు కావాలనే ఇలాంటి సీన్స్ చేస్తున్నారా .. లేక కథ భాగంగా చేస్తున్నారా అనేది పక్కన పెడితే.. గత కొన్నేళ్లుగా సినిమాల్లోకి కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయి అంటూ ఆయా సంఘాలు రోడ్డు ఎక్కుతున్నాయి. రీసెంట్‌గా ‘ఇపుడు కాక ఇంకెప్పుడు’ సినిమాలో శృంగార సన్నివేశాల సందర్భంగా బ్యాక్ గ్రౌండ్‌లో ఆది శంకరా చార్యులు వారు రాసిన భజ గోవిందం పాట పెట్టడం తీవ్ర దుమారం రేగింది. సినిమాలో ఆది శంకరా చార్యుల వారి భజ గోవిందం పాట పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో పరమ పవిత్రమైన ఈ గీతాన్ని వాడటంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.
తాాజాగా నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీపై వివాదం.. అందులోని ఓ సన్నివేశంపై హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హిందువులకు పవిత్రమైన ఋగ్వేదాన్ని కించ పరుస్తూ కొన్ని డైలాగులున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమాలో అవసరం లేకపోయినా.. ఉద్దేశ పూర్వకంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ జొప్పించారన్నారు. ముఖ్యంగా అపౌరుషేయాలైన ఋగ్వేదం కులం కాళ్లు పట్టుకునే గ్రంథం నాని చెప్పే డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ మూవీ దర్శకుడు ఇతర మత గ్రంథాల్లో ఉన్న వాటిని ఇదే విధంగా హీరోతో డైలాగులు చెప్పించగలరా అని హిందూ సంఘాలంటున్నాయి.
ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోగా నటించిన నానితో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాలో ఈ సన్నివేశం తొలిగించడంతో పాటు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. దీనిపై హీరో నాని ఎలా స్పందిస్తారనేది చూడాలి.
‘శ్యామ్ సింగరాయ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లో కలిసి రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. విజయానికి రూ. 3 కోట్ల దూరంలో ఉంది. మొత్తంగా నాని చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు ఏపీలో భారీ నష్టాన్ని కలిగించాయనే చెప్పాలి. లేకపోతే.. ఆ పాటికీ ‘శ్యామ్ సింగరాయ్’కు లాభాల్లోకి వచ్చి ఉండేది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే కదా.
Varudu Kaavalenu : నాగ శౌర్య, రితూ వర్మల ‘వరుడు కావాలెను’ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఫిక్స్..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. వీక్ డేస్‌లో నిలబడితే సినిమా నిలబడినట్లు లేదంటే అంతే సంగతులు. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. నాని నటించిన గత రెండు చిత్రాలు ‘వీ’, ‘టక్ జగదీష్’ చిత్రాలు థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత నాని సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో కచ్చితంగా వారం రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సేఫ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.