హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Shyam Singha Roy : కళ్లు చెదిరే రికార్డు రేటుకు నాని ’శ్యామ్ సింగ రాయ్’ హిందీ డబ్బింగ్ రైట్స్..

Nani - Shyam Singha Roy : కళ్లు చెదిరే రికార్డు రేటుకు నాని ’శ్యామ్ సింగ రాయ్’ హిందీ డబ్బింగ్ రైట్స్..

నాని ‘శ్యామ్ సింగరాయ్’ 13 రోజుల వసూళ్లు (Instagram/Photo)

నాని ‘శ్యామ్ సింగరాయ్’ 13 రోజుల వసూళ్లు (Instagram/Photo)

Nani - Shyam Singha Roy : కళ్లు చెదిరే రికార్డు రేటుకు నాని ’శ్యామ్ సింగ రాయ్’ హిందీ డబ్బింగ్ రైట్స్ కళ్లు చెదిరే భారీ రేటకు అమ్ముడు పోయాయి.

Nani - Shyam Singha Roy : కళ్లు చెదిరే రికార్డు రేటుకు నాని ’శ్యామ్ సింగ రాయ్’ హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఒకప్పుడు సినిమాలకు కేవలం థియేట్రికల్ హక్కులు మాత్రమే ఉండేవి. ఒకపుడు పాత సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేసేవారు. రిపీట్ రన్‌లో కూడా చాలా సినిమాలు మంచి వసూళ్లనే దక్కించుకునేవి. ఆ తర్వాత సినిమాలకు శాటిలైట్ హక్కులు ఓ వరంలా మారాయి. కొత్తలో రూ. 10 వేల నుంచి రూ లక్ష వరకు శాటిలైట్‌ హక్కులను వివిధ ఛానెళ్లు కొనుగోలు చేసేవి. ఆ తర్వాత ఆ సినిమాలను రెన్యువల్ చేసుకునేవారు. రాను రాను సినిమాలకు శాటిలైట్‌తో పాటు ఇపుడు డిజిటల్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ రూపేణా భారీగా అందుతోంది. టాప్ హీరో నటించిన సినిమాతో పాటు ఓ మోస్తరు హీరోలు నటించిన సినిమాలకు థియేట్రికల్‌తో పాటు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కులు అదనంగా వస్తున్నాయి.

ఇక నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇప్పటికే థియేట్రికల్, శాటిలైట్,డిజిటల్ హక్కులు భారీ రేటుకే అమ్ముడుపోయాయి.తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లకు B4U ఛానెల్ దక్కించుకుంది. మొత్తంగా నాని నటించిన హిందీ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో ఈ సినిమాకు ఈ రేంజ్ రేటు పలికిందని చెబుతున్నారు.

Priyanka Chopra : ప్రియాంక చోప్రా సంచలన నిర్ణయం.. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త నిక్ జోనస్ పేరు తొలిగింపు..


శ్యామ్ సింగరాయ్  (Shyam Singha Roy) విషయానికొస్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్, టీజర్‌కు  మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు రూ.  8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Rajinikanth - Peddhanna Final Collections: ‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు ఘోర అవమానం..

ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా రూ.  50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.  30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

Malluwood Heroes In Tollywood : మోహన్‌లాల్,మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ సహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోలు..

ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..

ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

First published:

Tags: Bollywood news, Nani, Shyam Singha Roy, Tollywood

ఉత్తమ కథలు