హోమ్ /వార్తలు /సినిమా /

Shyam Singha Roy : టీవీలో కూడా అదరగొట్టిన నాని శ్యామ్ సింగ రాయ్.. రేటింగ్ ఎంతంటే..

Shyam Singha Roy : టీవీలో కూడా అదరగొట్టిన నాని శ్యామ్ సింగ రాయ్.. రేటింగ్ ఎంతంటే..

Nani Shyam Singha Roy Photo : Twitter

Nani Shyam Singha Roy Photo : Twitter

Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్’  (Shyam Singha Roy) ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఫైనల్‌గా టెలివిజన్ ప్రీమియర్‌గా ఇటీవల ప్రసారం అయ్యింది. ఏప్రిల్ 3న ఆదివారం సాయంత్రం 6 గంటలకి జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వగా.. డీసెంట్ టీఆర్పీ వచ్చింది.

ఇంకా చదవండి ...

నాచురల్ స్టార్ నాని (Shyam Singha Roy) హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’  (Shyam Singha Roy) అనే పీరియాడిక్ డ్రామా 2021 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ చిత్రం ఫైనల్‌గా టెలివిజన్ ప్రీమియర్‌గా ఇటీవల ప్రసారం అయ్యింది. ఏప్రిల్ 3న ఆదివారం సాయంత్రం 6 గంటలకి జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. జెమినిలో టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అవ్వగా.. డీసెంట్ టీఆర్పీ వచ్చింది. ఫస్ట్ టెలికాస్ట్‌లో ఈ సినిమాకు 6.87 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన (Sai Pallavi ) సాయిప‌ల్ల‌వి, (Krithi Shetty) కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ః

ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను కూడా రాబట్టింది. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు. ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి పంచెకట్టు అంటూ ఫస్ట్ లిరికల్ విడుదలై మంచి ఆదరణ పొందింది.

First published:

Tags: Nani, Shyam Singha Roy

ఉత్తమ కథలు