NANI SHYAM SINGHA ROY 1ST WEEK WORLD WIDE COLLECTIONS COLLECTIONS TA
Shyam Singha Roy 1st Week Collections ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత బాకీ ఉందంటే..
నాని శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (shyam singha roy)
Shyam Singha Roy 1st WeekWorld Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. దాదాపు రెండేళ్ళ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Shyam Singha Roy 6 days World Wide collections : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. దాదాపు రెండేళ్ళ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీలో నాని రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్లేదు అనే రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కొంత మంది మనోభావాలు దెబ్బ తీసారనే వ్యాఖ్యలు మినహా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. హీరోగా నాని మరోసారి అదరగొట్టాడు.. సాయి పల్లవి కూడా తన పాత్రలో ఆకట్టుకుంది.
పైగా పునర్జన్మలకు లింక్ బాగానే కుదరడం.. క్లైమాక్స్ సీన్ బాగా పేలడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. 7వ రోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 14.92 కోట్లు వసూళుల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.80 కోట్లు షేర్ వసూలు చేసింది. మొత్తంగా ఏడవ రోజు.. రూ. 33 లక్షల షేర్ రాబట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాకు రావాల్సిన దానికంటే తక్కువగానే వస్తున్నాయి వసూళ్లు. దానికి ఎవరూ ఏం చేయలేరు. ప్రస్తతుతం అయితే ప్రస్తుతం మరో రూ. 1.70 కోట్లు మాత్రమే దూరంలో ఉంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా 7 రోజుల కలెక్షన్స్ చూద్దాం..
‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే. కానీ ఈయన నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడం.. థియేటర్స్‌కు రెండేళ్ల తర్వాత రావడంతో బిజినెస్ తక్కువగానే చేసారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ బాగానే ఉండటంతో కచ్చితంగా వారం రోజుల తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ సేఫ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సిరివెన్నెల పాటలు రాసారు. ఆయన పనిచేసిన చివరి సినిమా ఇది. ఏడు రోజు చాలా చోట్ల కలెక్షన్స్ వీక్‌గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 33 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.