హోమ్ /వార్తలు /సినిమా /

క్రేజీ దర్శకుడి సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని..

క్రేజీ దర్శకుడి సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని..

‘టక్ జగదీష్’ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన నాని (Twitter/Photo)

‘టక్ జగదీష్’ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన నాని (Twitter/Photo)

తాజాగా నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు నాని. 

  లాస్ట్ ఇయర్ నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. రీసెంట్‌గా నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమా కంప్లీట్ చేసాడు. తాజాగా ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపించునున్నాడు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు నాని.

  ‘టక్ జగదీష్’ పూజా కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు (Twitter/Photo)

  ఈ సినిమాలో నాని.. టక్ చేసుకొని తిరిగే సేల్స్ మేన్ క్యారెక్టర్ చేస్తున్నాడు.  ఈ సినిమాను ‘మజిలీ’ సినిమాను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్,  రితూ వర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టారు. కొరటాల శివ స్క్రిప్ట్‌ను కొరటాల శివకు అందచేసారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం హీరోగా నానికి 26వ సినిమా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aishwarya Rajesh, Nani, Ritu varma, Shiva Nirvana, Telugu Cinema, Tollywood, Tuck Jagadish

  ఉత్తమ కథలు