నాచురల్ స్టార్ నాని (Shyam Singha Roy) హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) అనే పీరియాడిక్ డ్రామా 2021 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా త్వరలో టీవీలో ప్రసారం కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy) సినిమా ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మైంట్స్ ఛానల్ జెమిని (Gemini)లో ప్రసారం కానుంది. అయితే ఎప్పుడనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా మార్చి రెండవ వారంలో ప్రసారం కోవోచ్చని అంటున్నారు. చూడాలి మరి అక్కడ ఎలా రెస్పాన్స్ దక్కించుకోనుందో.. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన (Sai Pallavi ) సాయిపల్లవి, (Krithi Shetty) కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను కూడా రాబట్టింది. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు.
ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. దసరా రోజున ఆయన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.
Latest Superhit.. #ShyamSinghaRoy coming soon on #GeminiTV#Nani #SaiPallavi #KrithiShetty pic.twitter.com/epK2za5vR0
— Telugu TV Updates (@telugutvupdts) March 8, 2022
ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Shyam Singha Roy, Tollywood news