Nani: ప్లాస్మా దానం చేయండి.. కోవిడ్ రికవరీ పేషెంట్స్‌కు నాని రిక్వెస్ట్..

Nani: న్యాచురల్ స్టార్ నానికి ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఏం చెప్పినా కూడా అభిమానులు వింటారనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 3, 2020, 6:33 PM IST
Nani: ప్లాస్మా దానం చేయండి.. కోవిడ్ రికవరీ పేషెంట్స్‌కు నాని రిక్వెస్ట్..
నాని హీరో (Actor Nani)
  • Share this:
న్యాచురల్ స్టార్ నానికి ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఏం చెప్పినా కూడా అభిమానులు వింటారనే నమ్మకం కూడా ఉంది. వివాదాలకు మ్యాగ్జిమమ్ దూరంగా ఉండే నాని.. అప్పుడప్పుడూ బయటికి వచ్చి అభిమానులకు సందేశం కూడా ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా అల్లకల్లోలం జరుగుతుంది. ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇండస్ట్రీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

నాని వి సినిమా (Nani V movie poster)
నాని వి సినిమా (Nani V movie poster)


ఇలాంటి సమయంలో సెలబ్రిటీస్ కూడా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. ఇప్పుడు నాని వచ్చి ప్లాస్మా దానం గురించి ప్రమోట్ చేస్తున్నాడు. నగర పోలీసు శాఖకు ఇచ్చిన ప్రోమోలో నాని కరోనా రికవరీ పేషెంట్స్‌కు ప్లాస్మా డొనేట్ చేయాలని కోరాడు న్యాచురల్ స్టార్. అందరూ ముందుకొచ్చి ప్లాస్మా దానం చేస్తే అందరికీ మంచిది అంటూ చెప్పాడు నాని.
Published by: Praveen Kumar Vadla
First published: August 3, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading