హోమ్ /వార్తలు /సినిమా /

Natural Star Nani: నేచుల్ స్టార్ నాని సినిమా కోసం భారీ సెట్.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాకే..

Natural Star Nani: నేచుల్ స్టార్ నాని సినిమా కోసం భారీ సెట్.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాకే..

నాని

నాని

Nani - Shyam Singa Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్‌ను వేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

  నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. అందుకు త‌గిన‌ట్లు ప్ర‌ణాళిక‌లు వేసుకుని షూటింగ్స్‌కు డేట్స్ కేటాయిస్తున్నాడు. రీసెంట్‌గా ట‌క్‌జ‌గ‌దీష్ షూటింగ్‌ను పూర్తి చేసిన నాని, ఇప్పుడు రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ‘శ్యామ్ సింగ‌రాయ్‌’ షూటింగ్‌లో బిబి బిజీగా ఉన్నాడు. నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లు ఉంటాయి. అందులో ఓ ల‌వ్‌స్టోరి హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కితే, మ‌రో ల‌వ్‌స్టోరి కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా కోసం నాని స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు.

  కాగా.. కోల్‌క‌త్తాలో స‌న్నివేశాల‌ను ఎలా చిత్రీక‌రించాల‌ని యూనిట్ చాలా మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది. అయితే ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కోల్‌క‌త్తాకు వెళ్లి షూటింగ్ చేయ‌డం రిస్క్ అవుతుంది. కాబ‌ట్టి.. కోల్‌క‌త్తా సెట్‌ను వేసి, ఆ సెట్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారట‌. నాని కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం నిర్మాత‌లు హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ప‌దిహేను ఎక‌రాల స్థ‌లంలో సెట్ వేయ‌డానికి రెడీ అయ్యార‌ట‌. ఈ సెట్ కోసం భారీ మొత్తాన్ని ఖ‌ర్చు పెట్ట‌బోతున్న‌ట్లు టాక్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

  ఈ సినిమాలో నాని మూడు షేడ్స్‌లో కనిపిస్తాడు. ఈ మూడు పాత్ర‌లు దేనిక‌వే డిఫ‌రెంట్‌గా ఉంటాయి. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డొన్నా సెబాస్టెయిన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి.. త‌ర్వాత ‘అంటే సుంద‌రానికి’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి నాని రెడీ అయిపోయాడు.

  Published by:Anil
  First published:

  Tags: Nani, Sai Pallavi, Tuck Jagadish

  ఉత్తమ కథలు