జెర్సీ సినిమా ఫైల్ ఫోటో
పాపం నాచురల్ స్టార్ నాని తన భార్య అంజనా కిచ్చిన మాటకోసం లిప్ లాక్ మిస్సయ్యాడట. అవును నాని తాజాగా జెర్సీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే కదా.వరుసగా
రెండు ఫ్లాపుల తర్వాత నాని ‘జెర్సీ’ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంలో నాని నటనను ఎన్టీఆర,రాజమౌళి, బన్ని సహా పలువురు సినిమా సెలబ్రిటీలు మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాద్ నటించింది. ఈ చిత్రంలో హీరో నాని, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మధ్య దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఒక లిప్‌లాక్ సన్నివేశాన్ని ప్లాన్ చేసాడట. అది కూడా కథలో భాగంగా ఎమోషనల్‌గా ఈ సీన్‌ను పెడితే బాగుంటుందని అనుకున్నారట. కానీ హీరో నాని మాత్రం లిప్‌లాక్ బదులు శ్రద్ధా శ్రీనాథ్ బుగ్గ మీద కిస్ చేస్తూ చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ ఇచ్చాడట.

జెర్సీ మూవీ సాంగ్
ఆ తర్వాత నాని ఎందుకిలా చేయాల్సి వచ్చిందో చిత్ర యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. అది తెలిసాక చిత్ర యూనిట్ పాపం నాని అనుకున్నారట. గతంలో నాని..‘ఆహా కళ్యాణం’లో సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ వాణికపూర్‌తో కలిసి నటించాడు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఆ తర్వాత నాని భార్య అంజనా ఆ చిత్రం చూసి చాలా ఫీలైందట. అప్పటి నుంచి హీరో నాని..ఏ హీరోయిన్‌తో భవిష్యత్తులో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించనని తన భార్యకు మాట ఇచ్చాడట. అందుకే ‘జెర్సీ’ మూవీలో జుర్రకోవడానికి శ్రద్ధా శ్రీనాథ్ పెదాలు ఉన్న భార్యకు ఇచ్చిన మాట కోసం లిప్‌లాక్ సీన్ మిస్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
First published:
May 2, 2019, 1:14 PM IST