Nani | Dasara : నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ మూవీ ఆ మధ్య విడుదలై ఓకే అనిపించుకున్న సంగతి తెలిసిందే. కంటెంట్ బాగున్న ఎందుకో పెద్దగా కనెక్ట్ కాలేదు జనాలకు. దీంతో కలెక్షన్స్ అనుకున్న రేంజ్‌లో రాలేదు. ఇక గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )తో మంచి సక్సెస్ అందుకున్నారు నాని. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై పరవాలేదనిపించాయి. ఇక అది అలా ఉంటే నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara ) అనే ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే . కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఇక భారీ అంచనాల నడుమ వస్తోన్న దసరా నుంచి రెండవ సింగిల్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం ఈరోజు ప్రకటిస్తామని టీమ్ తెలిపింది. అయితే ఈ రెండో సింగిల్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Every year we celebrate ‘love’ on Valentine’s Day.
But what about ‘Heart Break’ ? ????#DASARA #DasaraSecondSingle pic.twitter.com/tDNdlFGMbx — Nani (@NameisNani) February 8, 2023
ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్‌తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందట. టీజర్‌తో ఓ రేంజ్‌లో హైప్ వచ్చిన దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దసరా టీజర్ తర్వాత ఓ రేంజ్‌లో ఇప్పుడు జరుగుతుందట. పెరుగుతున్న డిమాండ్ కారణంగా తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాలకు 40 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్‌లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక సినిమా హిట్ టాక్ వస్తే.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా దసరా నిలిచిపోనుంది.
Yes it's DasaRAW ????#DasaraTeaser Trending on YouTube in 4 Languages across India with 13M+ views ????????
- https://t.co/4eBts4egum Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @NavinNooli @saregamasouth pic.twitter.com/rYYlUEnA2e — SLV Cinemas (@SLVCinemasOffl) January 31, 2023
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ టీజర్‌ను (Dasara Teaser ) విడుదల చేసింది. తెలుగు టీజర్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం మామూలుగా లేదని అంటున్నారు నెటిజన్స్. ఊరమాస్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో తెలుగు టీజర్ ఇప్పటికే 10 మిలియన్ పైగా వ్యూస్‌తో అదరగొడుతోంది. నాని యాక్టింగ్, కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఇరగదీశాడని.. సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.
ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ టీజర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే.. అన్ని భాషల్లోను అదిరింది రెస్పాన్స్. ముఖ్యంగా నాని మాస్ స్టైల్ యాక్షన్ సీన్స్, రస్టిక్ విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం నాని మేకోవర్ అదిరిందని.. కొత్త దర్శకుడు ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం బాగుందన్నారు. ముఖ్యంగా టీజర్‌లో లాస్ట్ షాట్ తోప్ అంటూ.. దర్శకుడికి ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అంటూ ట్వీట్ చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh