హోమ్ /వార్తలు /సినిమా /

Nani | Dasara : నాని దసరా విడుదల తేది ఖరారు.. అదిరిన లేటెస్ట్ పోస్టర్..

Nani | Dasara : నాని దసరా విడుదల తేది ఖరారు.. అదిరిన లేటెస్ట్ పోస్టర్..

Nani Dasara Release date confirmed Photo : Twitter

Nani Dasara Release date confirmed Photo : Twitter

Nani | Dasara : నాచురల్ స్టార్ నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Nani | Dasara :  నాచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికీ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరువాలేదనిపించింది. ఇక  గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు నాని. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి.  అది అలా ఉంటే నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara  )సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ( Dasara Release date )  30 మార్చి, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలో ఓ పల్లెటూరి పాత్రలో నటిస్తున్నారు.


  సుధాకర్‌ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్నఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు.  దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది.

  View this post on Instagram


  A post shared by Nani (@nameisnani)

  ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నాడట నాని.  ఇక నాని లేటెస్ట్ సినిమా అంటే సుందరానికీ సినిమా విషయానికి వస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Dasara Movie, Hero nani, Keethy suresh

  ఉత్తమ కథలు