హోమ్ /వార్తలు /సినిమా /

Nani | Dasara : కేజీయఫ్ నిర్మాతల చేతుల్లోకి దసరా.. ఇదేం క్రేజ్‌రా మావా..

Nani | Dasara : కేజీయఫ్ నిర్మాతల చేతుల్లోకి దసరా.. ఇదేం క్రేజ్‌రా మావా..

Dasara Photo : Twitter

Dasara Photo : Twitter

Nani | Dasara : నాచురల్ స్టార్ నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nani | Dasara :  నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ దసరా. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా మంచి అంచనాలతో విడుదలకు రెడీ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్’లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్‌లో ( Dasara theatrical rights ) బిజినెస్ జరిగింది. దిల్ రాజు (Dil Raju)సొంతం చేసుకున్నారు. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా కన్నడ థియేట్రికల్ రైట్స్‌కు కూడా అదిరిపోయే రేంజ్‌లో డిమాండ్ ఉందట. ఈ నేపథ్యంలో దసరా రైట్స్‌ను భారీ ధరకు కేజీయఫ్ (KGF) నిర్మాతలు హోంబాలే ఫిల్మ్స్‌కు దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే  20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.  దీంతో నాని సినిమాకు అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి నాని మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లను రాబట్టనుందో..

ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. అంతేకాదు రన్ కూడా లాక్ అయ్యింది.  ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో టీమ్ మరింత సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.  ఇక ఈ సినిమాలో మూడు అంశాలు సినిమాకి కీలకంగా మారనున్నాయట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం దసరా మూవీలో స్నేహం, ప్రేమ, ప్రతీకారం మూడు అంశాలు హైలైట్‌గా ఉండయనున్నాయట. ఈ మూడు ఏమోషన్స్‌తోనే సినిమాను దర్శకుడు అల్లు కున్నట్లు తెలుస్తోంది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల్వగా.. లేటెస్ట్‌గా మరో సాంగ్ విడుదలైంది. చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో  అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైంది.

ఇక మరోవైపు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్‌తో అమెరికాలో ఓరేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపుగా ఓ 700 లోకేషన్స్‌లో విడుదల కానుందని సమాచారం. దసరా సినిమా అక్కడ అన్ని భాషలతో సహా 700+ లొకేషన్‌లలో ప్రీమియర్‌‌లు పడనున్నాయట. దీంతో నాని కెరీర్‌లో మొదటి $2M+ సినిమాగా దసరా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక భారీ అంచనాల నడుమ వస్తోన్న దసరా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా..  మూడో సింగిల్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూడో పాట మార్చి 8న విడుదలకానున్నట్లు తెలిపింది టీమ్. ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్‌తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందట. టీజర్‌తో ఓ రేంజ్‌లో హైప్ వచ్చిన దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దసరా టీజర్ తర్వాత ఓ రేంజ్‌లో ఇప్పుడు జరుగుతుందట. పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాలకు 40 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్‌‌లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక సినిమా హిట్ టాక్ వస్తే.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌‌గా దసరా నిలిచిపోనుంది.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా  రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

First published:

Tags: Dasara Movie, Hero nani, Tollywood news

ఉత్తమ కథలు