Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ దసరా. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాటలు, టీజర్స్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా మంచి అంచనాలతో విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా.. హైదరాబాద్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ ఓ రేంజ్ లో బుకింగ్స్ అవుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో చాలా షోలు పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో నానికి బిగ్గెస్ట్ ఓపెనర్ అవ్వనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా మంచి ఆదరణ వస్తోంది. అక్కడ ఈచిత్రం ఇప్పటికే 200K డాలరస్ ప్రీ సేల్స్‌ను నమోదు చేసి అదరగొట్టింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్‌లో అదరగొట్టనుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్‌లో ( Dasara theatrical rights ) బిజినెస్ జరిగింది. దిల్ రాజు (Dil Raju)సొంతం చేసుకున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
BOOKINGS NOW OPEN for #DASARA ???? Witness the RAW action, drama, love and friendship only on BIG SCREENS ???????? Book your tickets now! - https://t.co/9H7Xp8iCz8#DasaraOnMarch30th Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/Tv9dJyoC9i
— SLV Cinemas (@SLVCinemasOffl) March 24, 2023
FDFS ? And then evening again ? Next day also ?#DASARA ???? pic.twitter.com/Z8HrzQmbad
— Nani (@NameisNani) March 26, 2023
దీంతో నాని సినిమాకు అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి నాని మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లను రాబట్టనుందో.. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. అంతేకాదు రన్ కూడా లాక్ అయ్యింది. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో టీమ్ మరింత సంతోషంగా ఉందని అంటున్నారు.
The excitement for #Dasara is peaking with every passing day ❤️????❤️????
100K+ Interests for #Dasara on @bookmyshow ???????? Book Your Tickets Now! - https://t.co/8DtYAFLtMf Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/D6iw0FSFFO — SLV Cinemas (@SLVCinemasOffl) March 25, 2023
ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మూడు అంశాలు సినిమాకి కీలకంగా మారనున్నాయట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం దసరా మూవీలో స్నేహం, ప్రేమ, ప్రతీకారం మూడు అంశాలు హైలైట్‌గా ఉండయనున్నాయట. ఈ మూడు ఏమోషన్స్‌తోనే సినిమాను దర్శకుడు అల్లు కున్నట్లు తెలుస్తోంది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల్వగా.. లేటెస్ట్‌గా మరో సాంగ్ విడుదలైంది. చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైంది.
#Dasara Grand Release on March 30th ???? Book your tickets now! - https://t.co/9H7Xp8jaoG pic.twitter.com/NybOHllVUc
— SLV Cinemas (@SLVCinemasOffl) March 28, 2023
ఇక మరోవైపు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్‌తో అమెరికాలో ఓరేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపుగా ఓ 700 లోకేషన్స్‌లో విడుదల కానుందని సమాచారం. దసరా సినిమా అక్కడ అన్ని భాషలతో సహా 700+ లొకేషన్‌లలో ప్రీమియర్‌లు పడనున్నాయట. దీంతో నాని కెరీర్‌లో మొదటి $2M+ సినిమాగా దసరా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దసరా టీజర్ తర్వాత ఓ రేంజ్‌లో ఇప్పుడు జరుగుతుందట. పెరుగుతున్న డిమాండ్ కారణంగా తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాలకు 40 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్‌లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక సినిమా హిట్ టాక్ వస్తే.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా దసరా నిలిచిపోనుంది. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా కన్నడ థియేట్రికల్ రైట్స్‌కు కూడా అదిరిపోయే రేంజ్‌లో డిమాండ్ ఉందట. ఈ నేపథ్యంలో దసరా రైట్స్‌ను భారీ ధరకు కేజీయఫ్ (KGF) నిర్మాతలు హోంబాలే ఫిల్మ్స్‌కు దక్కించుకుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh