Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ దసరా. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాటలు, టీజర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదలై దుమ్ములేపుతోంది. కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ఇప్పటికే అన్ని భాషల్లో 20 మిలియన్‌పైగా వ్యూస్‌ను రాబట్టింది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది టీమ్. ఇక ఈ సినిమా హిందీ ట్రైలర్‌కు కూడా సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరింది. దీంతో నాని సినిమాకు అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి నాని మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లను రాబట్టనుందో..
ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు రన్ కూడా లాక్ అయ్యింది. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో టీమ్ మరింత సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
15M+ views for the CHARTBUSTER #Dasara Third Single ❤️ - https://t.co/P0YPs788Tw#ChamkeelaAngeelesi #MainaruVettiKatti #ChamkeeliBushirtMein #HoovinaAngiThottu #PalaPalaaMinnerunne Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/x23Dxu7B48
— SLV Cinemas (@SLVCinemasOffl) March 15, 2023
ఇక ఈ సినిమాలో మూడు అంశాలు సినిమాకి కీలకంగా మారనున్నాయట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం దసరా మూవీలో స్నేహం, ప్రేమ, ప్రతీకారం మూడు అంశాలు హైలైట్‌గా ఉండయనున్నాయట. ఈ మూడు ఏమోషన్స్‌తోనే సినిమాను దర్శకుడు అల్లు కున్నట్లు తెలుస్తోంది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు.
#Dasara is a 2hours 36 minutes three frames long ???? scene.#AskNani https://t.co/VCeTYFcSjk
— Nani (@NameisNani) March 15, 2023
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల్వగా.. లేటెస్ట్‌గా మరో సాంగ్ విడుదలైంది. చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైంది.
#DasaraTrailer hits HUMONGOUS 20M+ Views with 460K+ Likes across 5 languages ❤️???? - https://t.co/CMNWNxbUZ3 Telugu Trailer Trending #1 on YouTube ????#Dasara Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/UizHFgq0HY
— SLV Cinemas (@SLVCinemasOffl) March 15, 2023
ఇక మరోవైపు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్‌తో అమెరికాలో ఓరేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపుగా ఓ 700 లోకేషన్స్‌లో విడుదల కానుందని సమాచారం. దసరా సినిమా అక్కడ అన్ని భాషలతో సహా 700+ లొకేషన్‌లలో ప్రీమియర్‌లు పడనున్నాయట. దీంతో నాని కెరీర్‌లో మొదటి $2M+ సినిమాగా దసరా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక భారీ అంచనాల నడుమ వస్తోన్న దసరా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా.. మూడో సింగిల్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూడో పాట మార్చి 8న విడుదలకానున్నట్లు తెలిపింది టీమ్. ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్‌తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందట. టీజర్‌తో ఓ రేంజ్‌లో హైప్ వచ్చిన దసరా చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నట్లు తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దసరా టీజర్ తర్వాత ఓ రేంజ్‌లో ఇప్పుడు జరుగుతుందట. పెరుగుతున్న డిమాండ్ కారణంగా తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాలకు 40 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్‌లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక సినిమా హిట్ టాక్ వస్తే.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా దసరా నిలిచిపోనుంది.
Natural ⭐ @NameisNani received a ROCKING RECEPTION from the crowd at the #Dasara Trailer Launch event in Lucknow????#DasaraTrailer Out now???? - https://t.co/CMNWNxbUZ3#DasaraOnMarch30th@KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/Brqzx6WMwM
— SLV Cinemas (@SLVCinemasOffl) March 14, 2023
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు.
దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh