హోమ్ /వార్తలు /సినిమా /

అక్కడ నిరాశ పరిచిన నాని జెర్సీ... ఫీల్ అవుతోన్న అభిమానులు

అక్కడ నిరాశ పరిచిన నాని జెర్సీ... ఫీల్ అవుతోన్న అభిమానులు

Photo:  Twitter.com/SitharaEnts

Photo: Twitter.com/SitharaEnts

నాని నటించిన 'జెర్సీ' మూవీ హార్ట్ టచింగ్ కథ కథనాలతో ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ల నటనకు ఫిదా అయ్యారు..సినీ అభిమానులు. థియేటర్ రన్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న జెర్సీ మూవీ.. ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది.

ఇంకా చదవండి ...

నాని నటించిన 'జెర్సీ' మూవీ హార్ట్ టచింగ్ కథ కథనాలతో ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ల నటనకు ఫిదా అయ్యారు..సినీ అభిమానులు. ఈ సినిమా ఇటు రెండు రాష్ట్రాలతో పాటు అటూ ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది.  దీనికి తోడు ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో  మిడిల్ క్లాస్ ఇబ్బందుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్బుతంగా తెరకెక్కించాడు. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది.  అయితే థియేటర్‌లో కంటే టీవీల్లో అదరగొట్టుందనుకున్న ఈ సినిమా.. అనుకున్నంతగా రేటింగ్స్‌ను రాబట్టలేకపోయింది. జెర్సీ శాటిలైట్ హక్కుల్నీ దక్కించుకున్న జీ నెట్ వర్క్  ఈ సినిమాని ఇటీవలే జీ తెలుగులో వరల్డ్ ప్రీమియర్‌గా బ్రాడ్ కాస్ట్ చేసింది.  అయితే జెర్సీ కేవలం 8.8 రేటింగ్‌తో కాస్త నిరాశను మిగిల్చింది.

టీవీలో తొలిసారి ప్రసారం అయిన జెర్సీకి ఆదరణ అనుకున్నంతగా దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది అలా ఉంటే వెంకటేష్, వరుణ్ కాంబీనేషన్‌లో వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'ఎఫ్2' ఇప్పటికే రెండు సార్లు టెలీకాస్ట్ చేశారు. తాజాగా మూడోసారి టీవీలో వేసినా కూడా 'జెర్సీ' కంటే మంచి రేటింగ్ పొందిందని సమాచారం. మూడవ సారి టెలికాస్ట్ అయిన 'ఎఫ్ 2'కి ఏకంగా 9.6 రేటింగ్ దక్కడం చూస్తుంటే.. టీవీ ప్రేక్షకులు మసాలా కంటెంట్‌ను ఇష్ట పడుతున్నారని తెలుస్తోంది.  అయితే నాని అభిమానులు మాత్రం టీవీలో అదరగొట్టుదన్నుకున్న జెర్సీకి.. అనుకున్నంతగా రేటింగ్స్ రాకపోవడంతో కాస్తా ఫీల్ అవుతున్నారు.

First published:

Tags: Jersey, Nani, Telugu Cinema News, Tollywood Movie News

ఉత్తమ కథలు