హోమ్ /వార్తలు /సినిమా /

Nani Jersey: నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..

Nani Jersey: నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..

నాని ‘జెర్సీ’మూవీకి అరుదైన గౌరవం (File/Photo)

నాని ‘జెర్సీ’మూవీకి అరుదైన గౌరవం (File/Photo)

Nani Jersey | నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Nani Jersey | నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గత కొన్నేళ్లుగా భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే కుటుంబ సభ్యులు భారతీయ భాషల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లుగా ఆయన పేరుతో చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించిన వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తున్న సంగతి తెలిసిందే కదా. 2018 వరకు ప్రతి యేట ఈ అవార్డులు ఇస్తూ వస్తున్నారు. 2019 సంబంధించిన అవార్డులు 2020లో ప్రకటించడం ఆనవాయితీ. ఈ సారి కరోనా కారణంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన వాయిదా పడింది. ఆ సంగతి పక్కన పెడితే.. దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ తెలుగు కేటగిరిలో 2019కి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. అందులో  ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ సినిమా అవార్డు కైవసం చేసుకుంది.

ఇక ఉత్తమ నటుడి అవార్డును నవీన్ పోలీశెట్టి దక్కించుకున్నాడు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. డియర్ కామ్రేడ్‌లో నటనకు రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది. భారీ బడ్జెట్‌‌తో ‘సాహో’ మూవీని తెరకెక్కించిన సుజీత్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన థమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. మొత్తంగా 2019 అవార్డులో భాగంగా 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఎలా ఇస్తారని కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే.. సెన్సార్ అయిన డేట్ ప్రకారం ఎంట్రీస్ పంపితే.. ప్రభుత్వం అవార్డుల ఇవ్వడం కామన్. కానీ ఓ ప్రైవేటు సంస్థ ఇలా 2019 అవార్డులు అని చెప్పి 2020లో విడుదలైన సినిమాకు అవార్డు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

First published:

Tags: Dadasaheb Phalke Award, Jersey, Tollywood

ఉత్తమ కథలు