హోమ్ /వార్తలు /సినిమా /

యూఎస్‌లో కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న నాని..

యూఎస్‌లో కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న నాని..

జెర్సీ పోస్టర్

జెర్సీ పోస్టర్

నాని జెర్సీ అమెరికాలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా జెర్సీ మూవీ కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. దీంతో అక్కడి బాక్సాఫీస్‌లు షేక్ అవ్వుతున్నాయి.

నాని జెర్సీ అమెరికాలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా జెర్సీ మూవీ కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. దీంతో అక్కడి బాక్సాఫీస్‌లు షేక్ అవ్వుతున్నాయి. వివరాల్లోకి వెళితే..ఏప్రిల్ 19న విడుదలైన 'జెర్సీ' అమెరికాలో సూపర్ కలెక్షన్లతో ఇరగదీస్తోంది. దీంతో నాని జెర్సీ తాజాగా అక్కడ 1 మిలియన్ మార్కును మొదటి ఐదు రోజుల్లోని అందుకుని..నాని కేరిర్‌లో వన్ మిలియన్ మార్క్‌ను అందుకున్న ఆరవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే నాని ఇంతకు ముందు సినిమాల చరిత్ర లేదా అతను ఎంచుకునే కథల విషయంలో కొంత కొత్తదనం ఉండటం..అవి మంచిగా అలరించడంతో యూఎస్ఏలో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నిన్నుకోరి, నేను లోకల్ సినిమాలు మిలియన్ డాలర్ చిత్రాలుగా నిలిచాయి. అయితే జెర్సీ వీటన్నింటినీ మించిన హిట్ కాబోతోంది. ఈ చిత్రాన్ని అక్కడ దాదాపు 140 లొకేషన్లలో విడుదల చేశారు. దానికి తగ్గట్టే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ మూవీ అమెరికాలో $911k వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగింది. దీంతో సినిమా విడుదలైన ఐదో రోజుకే వన్ మిలియన్ మార్క్‌ను చేరుకుంది. అయితే యూఎస్ఏలో 'భలే భలే మగాడివోయ్' సినిమా నాని కెరీర్ బెస్ట్ సినిమాగా ఇప్పటివరకు ఉంది. ఆ సినిమా అక్కడ మొత్తం రన్‌లో $1.43 మిలియన్ రాబట్టింది.


జెర్సీ పోస్టర్ Photo: Twitter

అయితే ఈ 'జెర్సీ' సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్‌ను చేరుకోవడంతో..ఇంకొద్ది రోజుల్లోనే నాని ది బెస్ట్ రికార్డ్‌‌ను బద్దలు కొట్టి మరో కొత్త రికార్డ్‌ను సృష్టించడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నాయి ట్రెడ్ వర్గాలు.

అయితే ఈ సినిమాను చూసిన దర్శకుడు రాజమౌళి..నాని నటనను, డైరెక్టర్ గౌతమ్‌ను ఇతర సిబ్బందిని మెచ్చుకుంటూ..ఓ ట్వీట్ చేశారు.

First published:

Tags: Gowtam Tinnanuri, Jersey, Nani, Shraddha Srinath, Telugu Cinema News, USA

ఉత్తమ కథలు